జగనొస్తాడు, తెస్తాడు: టూర్లో విజయమ్మ హామీ(పిక్చర్స్)
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజమయ్మ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే ఆధునికీకరణ పనులు జరిగి వరదలు ఇంతగా నష్టపర్చకపోయి ఉండేవని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం వల్లనే ఇంత పంట నష్టం, ఆస్తి నష్టం, మరణాలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోను తగిన రక్షణ లేదన్నారు. పంట నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రైతుకు ఒక్కో ఎకరాకు పదివేల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే వైయస్ సువర్ణయుగం తీసుకు వస్తారన్నారు. విజయమ్మ రైతులను, బాధితులను పరామర్శించి వారుకు ధైర్యం చెబుతూ పర్యటించారు.

విజయమ్మ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు.

విజయమ్మ 2
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

విజయమ్మ 3
పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

విజయమ్మ 4
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ పొలాల వెంబడి నడుస్తున్నదృశ్యం.

విజయమ్మ 5
పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. బురద నీటిలో నుండి వెళ్తున్న విజయమ్మ.












Click it and Unblock the Notifications