కొండచరియను ఢీకొంది: విజయమ్మకు తప్పిన ప్రమాదం

విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా మన్యంలో ఆదివారం ప్రచారంలో భాగంగా అరకులోయ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం వెళ్తుండగా అనంతగిరి ఘాట్ రోడ్డులోని ఐదో నెంబర్ మలుపు వద్ద కాన్వాయ్‌లో ఆమె వెళ్తున్న వాహనానికి బ్రేకులు ఫెయిలయ్యాయి.

దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పక్కనే ఉన్న బండారాయిని గుద్ది వాహనాన్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో విజయమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆమె మరో వాహనంలో విశాఖపట్నం చేరుకున్నారు. మరోవైపు ప్రమాదం సమయంలో ఆమె ఆ వాహనంలోనే లేరని మరికొందరు చెబుతున్నారు.

YS Vijayamma narrow escape from an accident

ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టనష్టాలకు ఓర్చి అయినా ప్రజలకు అండగా ఉంటానని వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సత్తుపల్లి నుంచి ఖమ్మం వరకూ రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. ప్రజలు కనిపించిన ప్రతిచోటా జగన్ ఆగి వారితో ముచ్చటించారు.

రాష్ట్రం ఏర్పడిన అరవై ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చెప్పిన ఘనత వైయస్‌తే దక్కిందన్నారు. అందుకే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడన్నారు. నాటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించటమే లక్ష్యంగా తాను ముందుకెళ్తున్నట్టు చెప్పారు. తన తండ్రి చనిపోయిన సమయంలో అనేకమంది గుండెలు ఆగిపోయాయని, వారిని పరామర్శించేందుకు వద్దామనుకుంటే అనేక ఇబ్బందులు పెట్టారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+