వైసీపీకి విజయమ్మ రాజీనామా - షర్మిలకు మద్దతుగా నిలవాలి : విజయమ్మ ఎమోషనల్..!!
వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేసారు. ఎమోషనల్ అయ్యారు.వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకొని..ఇటు జగన్ - అటు షర్మిల తల్లిగా బాధ్యతగా వారి వెనుక నిలుస్తానని స్పష్టం చేసారు. జగనన్న వదిలిన బాణంగా షర్మిల పాత్రను వివరించారు. మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ప్లీనరీ వేదికగా విజయమ్మ చెప్పుకొచ్చారు. తమ కుటుంబం అభిమానంతో బతికిన కుటుంబమంటూ ఉద్వేగానికి గురయ్యారు. తమ మధ్య అనుబంధాలు గొప్పవని చెప్పుకొచ్చారు.

వైసీపీకి విజయమ్మ రాజీనామా
తన అన్నకు కష్టం రాకూడదనే షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి..అండగా నిలుస్తోంది. షర్మిలకు తల్లిగా.. జగన్ పార్టీలో గౌరవాధ్యక్షురాలిగా ఉండటం పైన చాలా చర్చ జరుగుతోంది. తల్లిగా ఈ విమర్శలను పట్టించుకోలేదు. ఇద్దరికీ తల్లిగా అక్కడ - ఇక్కడ ఉన్నాను. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తెలంగాణలో షర్మిల పోటీ చేయనుంది. జగన్ సైతం ఏపీలో కీలకంగా ఉన్నారు. జగన్ - షర్మిలకు ఇద్దరు వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదని చెప్పుకొచ్చారు. దేవుడు నడిపిస్తున్నానని నమ్ముతానని చెప్పుకొచ్చారు. వక్రీకరణలకు అవకాశం లేకుండా.. ఇద్దరి పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి రెండో సారి ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు.

నన్ను క్షమించండి..తల్లిగా అండగా నిలుస్తా
తన నిర్ణయం అర్దం చేసుకోవాలని.. తనను క్షమించాలని విజయమ్మ కోరారు. తాను సంతకం చేయని ఒక లేఖను విడుదల చేసారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. షర్మిల తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్నారని..తల్లిగా అండగా నిలబడాల్సిన అవసరం ఉందని వివరించారు. కష్టాల్లో ఉన్న సమయంలో కలిసి ఉన్నాం...కుమారుడు సంతోషంతో ఉన్నారని చెప్పారు. కుమార్తె కష్టాల్లో ఉన్న సమయంలో వదలటం సరి కాదనేది తన అభిప్రాయమని విజయమ్మ వివరించారు. వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసారు. జగన్ రాజకీయంగా బలపడిన విధానం గురించి చెప్పుకొచ్చారు. జగన్ జన నేతగా అభివర్ణించారు. వైఎస్సార్ మరణం తరువాత కాంగ్రెస్ పొమ్మనకుండా పొగ పెట్టిందని చెప్పుకొచ్చారు. జగన్ తక్కువ కాలంలోనే సీనియర్ పొలిటీషియన్ గొంతు తడి ఆరిపోయేలా చేసారంటూ చెప్పారు.

అక్రమ కేసులతో వేధించారు..
తమ కుటుంబాన్ని కాంగ్రెస్ లో పొమ్మనకుండా పొగ పెట్టారని చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట కోసం వైసీపీ పుట్టిందన్నారు. అధికారం కోసం అనేక పార్టీలు పుడుతూ ఉంటాయని..కానీ, ప్రజల కోసం వైసీపీ పుట్టిందని వివరించారు. జగన్ అధికారంలోకి రావటం వెనుక అనేక కష్టాలు ఉన్నాయన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించారని గుర్తు చేసుకున్నారు. అధికారిక శక్తులన్నీ కలిసి విరుచుకుపడ్డా చలించలేదన్నారు. జగన్ వైఎస్సార్ కుమారుడిగా కాలు పెట్టి సీఎం అయ్యాడని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పథకాలు అమలు చేశారని చెప్పుకొచ్చారు. తన బిడ్డను మీ చేతుల్లో పెట్టాననని గతంలోనే చెప్పిన మాటను గుర్తు చేసారు. ఏపీ రానున్న రోజుల్లో తల ఎత్తుకొనేలా చేస్తారన్నారు. పేదల పిల్లల భవిష్యత్ ను జగన్ చేతుల్లో పెట్టాలంటూ పిలుపునిచ్చారు. జగన్ కోసం షర్మిల పాదయాత్ర ప్రారంభించిన సమయం లో తాను భయపడ్డానని..ప్రతీ కష్టాన్ని ఎదుర్కొని ఈరోజు జగన్ అధికారంలో ఉన్నారని విజయమ్మ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications