టీడీపీ అభ్యర్ధిగా వైఎస్ వివేకా కుమార్తె..!! చంద్రబాబు వ్యూహం : పులివెందులలో ఏం జరుగుతోంది..!!

టీడీపీ అధినేత నేరుగా పులివెందులపైనే గురి పెట్టారా. అందునా వైఎస్ కుటుంబం నుంచే జగన్ ను టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారా. అసలు ఏం జరుగుతోంది. 2019 లో జరిగిన వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్... కడప ఎంపీ అవినాశ్ పైన సీబీఐ అనుమానాలతో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. వివేకా హత్య కేసులో సీబీఐ అభియోగాలను వైసీపీ నేతలు తప్పు బడుతున్నారు. చార్జిషీటులో సీబీఐ పచ్చి అబద్ధాలను వండివార్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా ఇప్పుడు టీడీపీ నేతలు ఎంపీ అవినాశ్ రెడ్డి ని టార్గెట్ చేస్తున్నారు.

వైఎస్ వివేకా కుమార్తెకు టీడీపీ టికెట్

వైఎస్ వివేకా కుమార్తెకు టీడీపీ టికెట్

ఇదే సమయంలో తాజాగా సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు వ్యూహం ఏంటనేది ఆయన బయట పెట్టారు. సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి.. వైఎస్‌ కుటుంబాన్ని ఎలాగోలా చీల్చాలి.. నేరాన్ని కుటుంబం మీదే తోసేయాలి. ఇదీ చంద్రబాబు వ్యూహం..అంటూ చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ సునీత హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ కొనసాగుతోంది. అందులో దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ ఇప్పటికే పలువురిని విచారించింది. సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాల పైన ఇప్పుడు రాజకీయంగా విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఇదే సమయంలో వివేకా లోటు వైసీపీకి ఎదురుదెబ్బని, సీఎం జగన్‌ పెద్ద అండను కోల్పోయారన్నారు.

సీబీఐ ఛార్జ్ షీట్ తో మారుతున్న రాజకీయం

సీబీఐ ఛార్జ్ షీట్ తో మారుతున్న రాజకీయం

2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం.. ముందు రోజు సైతం జమ్మలమడుగులో వివేకా ప్రచారం చేసారని.. అటువంటిది సీటు కోసం అవినాశ్ పైన అనుమానాలు వ్యక్తం చేయటం ఏంటని ప్రశ్నించారు. అయితే, చంద్రబాబు సొంత నియోజకవర్గం పైన వైసీపీ ఈ సారి స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా చంద్రబాబు ను ఓడిస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ చేసారు.

ఇదే సమయంలో వివేకా హత్య తరువాత వైఎస్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను టీడీపీ అధినేత నిశితంగా గమనిస్తున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపడుతూనే..నాడు జగన్ కుటుంబం నుంచి వైఎస్ వివేకాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆరు నెలల తరువాత ఆయన రాజీనామ చేసి తిరిగి జగన్ తో కలిసారు.

చంద్రబాబు వ్యూహం అదేనా..

చంద్రబాబు వ్యూహం అదేనా..

ఇక, ఇప్పుడు వైఎస్ వివేకా కుమార్తె సునీత అంగీకరిస్తే టీడీపీ నుంచి టికెట్ ఇచ్చి బరిలో నిలపాలనేది చంద్రబాబు వ్యూహంగా వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబుతో సునీత ఒక ఆస్పత్రిలో కలిశారనే ప్రచారం సైతం వైసీపీలో వినిపిస్తోంది. ఇప్పటికే షర్మిల అన్న మాట కాదని తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసారు. షర్మిల దీక్ష సమయంలోనూ సునీత మద్దతు ప్రకటించారు. అయితే, హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కార్పోరేట్ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యురాలిగా ఉన్న సునీత.. నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా... టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా అందుకు సిద్దంగా ఉన్నారా అనేదే అసలు చర్చ.

సునీత అంగీకరించేనా..

సునీత అంగీకరించేనా..

టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబం పోరాటం చేసింది. ఇప్పుడు ...సునీతకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా అంగీకరించే అవకాశాలు లేవని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. కానీ, సునీతను ఒప్పించేందుకు టీడీపీ టీం ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదనేది మరో చర్చ. దీంతో..ఇప్పుడు పులివెందులలో రానున్న ఎన్నికల సమయానికి ఎవరు బరిలో నిలుస్తారు...ఏం జరగబోతుందనే ఆసక్త కర ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+