YS Viveka murder case : విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్ ను విచారించాలి : మాజీ మంత్రి జవహర్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా వెలుగు చూస్తున్న పరిణామాలపై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ మంత్రి జవహర్ వైయస్ వివేకానంద రెడ్డి హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐ అధికారుల ముందు వివిధ డిమాండ్లను ఉంచారు. వైయస్సాసుర రక్త చరిత్రను కప్పిపుచ్చే బూటకపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు జగన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన మాజీ మంత్రి జవహర్ పలు కీలక విషయాలను వెల్లడించారు .

విజయసాయిరెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి గుండెపోటని ఎలా చెప్తారు ?
క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అసలు నిందితుల్ని ఈ రోజుకీ విచారించటం లేదని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు విచారణ జరుగుతుందని జవహర్ అభిప్రాయపడ్డారు. గొడ్డలితో దాడి చేసి వివేకానంద రెడ్డిని హతమారిస్తే విజయసాయిరెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారని చెప్పడం వెనుక ఉన్న కారణాలను వారిని విచారించి బయటకు తీసుకు రావాలని జవహర్ డిమాండ్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డిని వారే హతమార్చినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.

గొడ్డలి వేటుకు, గుండె పోటుకు ఉన్న సంబంధం ఏంటి?
గొడ్డలికి గుండె పోటుకి ఉన్న సంబంధం ఏమిటో ప్రశ్నించాలని, వారిద్దరినీ విచారించక పోవడం చాలా దుర్మార్గం అంటూ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత బాబాయి చనిపోతే ఈ రోజుకి నిందితులను పట్టుకోకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత సాక్షాత్తూ 15 మంది అనుమానితుల పేర్లను విచారించవలసినదిగా కోరినప్పటికీ వారందరిని విచారించడం లేదని జవహర్ అభిప్రాయపడ్డారు. విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి ల పాత్రలను అనుమానించాలి అని, వివేకానంద రెడ్డి హత్యకు ముందు రోజు రాత్రి వారి కాల్ రికార్డులను పరిశీలించాలని జవహర్ డిమాండ్ చేశారు .

సునీత ఇచ్చిన అనుమానితుల జాబితాలో విజయసాయి రెడ్డి,అవినాష్ రెడ్డి పేర్లు
జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్యలో జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణం కూడా దాగి ఉందని జవహర్ అనుమానం వ్యక్తం చేశారు. వైయస్ వివేకానంద రెడ్డిని హతమార్చి చంద్రబాబుకు రక్తపు మరకలు అంటించే ప్రయత్నం చేశారని విమర్శించిన జవహర్, హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు వైఎస్ కుటుంబం పెట్టింది పేరని, చంద్రబాబుకు అలాంటివి తెలియవని పేర్కొన్నారు. ప్రధాన సూత్రధారులు విజయసాయి రెడ్డి,అవినాష్ రెడ్డి అని సునీత అనుమానితుల పేర్ల జాబితాలో ఇచ్చినప్పటికీ వారిని ఎందుకు విచారించలేదని జవహర్ ప్రశ్నిస్తున్నారు.

జగన్ కు తెలిసే అంతా .. జగన్ ను ఎందుకు విచారించరు ?
ఈ వ్యవహారమంతా జగన్మోహన్ రెడ్డికి తెలుసని సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారని పేర్కొన్న జవహర్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. కేసును పక్కదారి పట్టించకుండా ఆ రోజు ఆయన బట్టలు మార్చింది ఎవరు? రక్తపు మరకలు తుడిచింది ఎవరు ? ఆయన తలకు కట్టుకట్టింది ? వాడిన ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి ?ఎవరు కీలక సూత్రధారులు వంటి అన్ని విషయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని జవహర్ డిమాండ్ చేశారు.

వైఎస్ కుమార్తె సునీత కుటుంబానికి రక్షణ కల్పించాలి
ఇదే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సునీత కుటుంబానికి రక్షణ కల్పించాలని జవహర్ డిమాండ్ చేశారు. ఈ హత్యలో వైసీపీ నాయకుల పాత్రను, జగన్మోహన్ రెడ్డి పాత్రను విచారించాలని, త్వరితగతిన ఈ హత్యకేసును తేల్చి ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని జవహర్ సిబిఐ దర్యాప్తు సంస్థకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారిస్తున్న సీబీఐ అధికారులు కీలక విషయాలను గుర్తించారు .

వివేకా హత్యకేసులో కొనసాగుతున్న దర్యాప్తు ..
మాజీ మంత్రి వైయస్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్ర నాథ్ రెడ్డిని కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు విచారణ జరిపారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి రక్తపు మడుగులో పడి ఉంటే సాధారణ మరణం అని ఎలా అనుకున్నారు అంటూ ఆయనను ప్రశ్నించారు. ఇక ఈ కేసును త్వరితగతిన తేల్చడానికి సిబిఐ బృందాలు ఎనభై ఆరు రోజులుగా నాన్ స్టాప్ గా విచారణ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో సిబిఐ అధికారులు ముఖ్యంగా వైసీపీకి చెందిన నాయకులను, వైయస్ వివేకాకు అత్యంత సన్నిహితులను విచారిస్తూ ఉండటంతో టిడిపి నేతలు జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత బాబాయ్ హత్య లో జగన్ పాత్ర ఉందంటూ నిప్పులు చెరుగుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications