వివేకా కేసులో కొత్త ట్విస్టు - అల్లుడు నర్రెడ్డి వాంగ్మూలం : అలా..సృష్టించారంటూ..!!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐ విచారణలో భాగంగా పలువురి నుంచి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. అందులో భాగంగా.. వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి వెల్లడించిన అంశాల్లో కొత్త కోణం ఇప్పుడు చర్చకు కారణమైంది. పోలీసులకు, సిట్ అధికారులకు తాను వాంగ్మూలం ఇవ్వలేదని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి వెల్లడించిన విషయం వెలుగు లోకి వచ్చింది. ఆయన రాష్ట్ర పోలీసులకు ఇచ్చినట్లుగా ఉన్న వాంగ్మూలాల ప్రతుల్ని విచారణలో భాగంగా సీబీఐ అధికారులు రాజశేఖర్‌రెడ్డికి చూపించారు.
Recommended Video

ఆ వాంగ్మూలం తాను ఇవ్వలేదంటూ
వాటిని పరిశీలించిన ఆయన .... తానెప్పుడూ అలా వాంగ్మూలాలు ఇవ్వలేదన్నారు. పోలీసులే ఆయా అంశాలను సృష్టించారంటూ వివరించారు. వివిధ సందర్భాల్లో సీబీఐ అధికారులకు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. వివేకా చనిపోయారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల15 నిమిషాల సమయంలో తనకు ఫోన్ చేసి చెప్పారని రాజశేఖర రెడ్డి వివరించారు.
ఆ సమయంలో తాను హైదరాబాద్ లో ఉన్నానన్నారు. ఆ వెంటనే పులి వెందులకు బయల్దేరామని చెప్పారు. ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించారనే విషయం చెప్పేసరికి కర్నూలు వద్ద ఉన్నామని తాను చెప్పినట్లు వాంగ్మూలంలో ఉందన్నారు. అది తప్పు అని ఆయన సీబీఐకి స్పష్టం చేసారు.

తాను చెప్పివని కాదంటూ
అదే విధంగా 2019 మార్చి 15న సీఐ శంకరయ్యకు తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. 2019 మార్చి 16న మాత్రమే ఆయనకు వాంగ్మూలం ఇచ్చానన్న ఆయన... అందులో ఉన్న అంశాలు తాను చెప్పినవి కాదంటూ రాజశేఖర రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఘటనా స్థలం వద్ద లభించిన లేఖను తన భార్య సునీత.. ఎంవీ కృష్ణారెడ్డి వద్ద నుంచి తీసుకుని మీడియా ఎదుటే సీనియర్ పోలీసు అధికారులకు ఇచ్చినట్లు వాంగ్మూలంలో ఉందంటూ..దాని మీద స్పష్టత ఇచ్చారు.
సీఐ శంకరయ్య, డీఎస్పీ నాగరాజులు కావాలనే ఈ తప్పుడు వాంగ్మూలాలు సృష్టించారని... శవ పంచనామా సమయంలో తాము పులివెందుల్లో ఉన్నట్లు చెప్పేందుకు వీలుగా అలా చేశారని సీబీఐకి చెప్పారు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ 2019 మార్చి 29న డీఎస్పీ నాగరాజుకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా నమోదు చేశారన్నారు.

ఆ లేఖ ను ఉంచమని చెప్పాం
ఆ రోజున ఆమె కడపలో కానీ, పులివెందులో కానీ లేరని సీబీఐకి స్పష్టం చేసారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి.. మరోసారి ఉదయం 6 గంటల 23 నిమిషాల సమయంలో ఫోన్ చేసి ఘటనా స్థలంలో ఓ లేఖ లభించిందని చెప్పారని..అందులో అంశాలు చదవి వినిపించటంతో పాటుగా.. డ్రైవర్ ప్రసాద్ పేరు ఆ లేఖలో ఉందని చెప్పిన విషయాన్ని సీబీఐతో పంచుకున్నారు. అయితే, వివేకా మృతదేహంపై ఉన్న గాయాలు గురించి చెప్పలేదన్నారు.
ఆ లేఖ వేరే వారి చేతుల్లోకి వెళ్లకూడదని, డ్రైవర్ ప్రసాద్‌పై దాడి జరగకుండా ఉండాలనే ఉద్దేశం..దొంగాట ఆడుతున్న వారిని పట్టించాలనే ఆ లేఖను తాము పులివెందులకు చేరేంత వరకూ ఆయన వద్దే భద్రపరచమని కృష్ణారెడ్డికి చెప్పానని సీబీఐకి వెల్లడించారు. ఆ విషయాన్ని ఆ తరువాత తాను తన భార్యతోనూ చెప్పానని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేసారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications