వైఎస్ జగన్, భారతి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు, చిత్రహింసలు పెట్టారు, న్యాయం చెయ్యండి

వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి, కడప వైసీపీ ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, చిత్ర హింసలు పెట్టారని, తనను ప్రలోభ పెట్టి భారీ మొత్తంలో డబ్బు ఆశ కూడా చూపించారని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు లో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు

మంగళవారం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత దస్తగిరి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు శివ శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని దస్తగిరి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు జగన్ ప్రభుత్వానికి బానిసలుగా మారారని, ఆ సమయంలో తాను ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఆరోపించారు.

YS Vivekananda Reddy s murder case Afprover Dastagiri s sensational comments

వైఎస్ జగన్ ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ సమయంలో ఒక పోలీస్ అధికారి కూడా నాకు న్యాయం చేయడానికి ముందుకు రాలేదని దస్తగిరి ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో మాతో రాజీ కావాలని, మేము చెప్పినట్లు వినాలని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను ప్రలోభాలకు గురి చేశాడని, భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని తనకు ఆశ చూపించారని దస్తగిరి ఆరోపించారు.

అయితే తాను వారితో రాజీ కాలేదనే కోపంతో కడప సెంట్రల్ జైల్లో తనను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని, అప్పటి కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ప్రకాష్ అనేక ఇబ్బందులకు గురి చేశారని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అఫ్రేవర్ దస్తగిరి ఆరోపించారు. తాను కడప సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అక్కడి సీసీటీవీ ఫుటేజీలు తొలగించారని, ఈ విషయంపై దర్యాప్తు జరిపించాలని కడప జిల్లా ఎస్పీ, సీబీఐకి మనవి చేస్తున్నానని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అన్నారు.

YS Vivekananda Reddy s murder case Afprover Dastagiri s sensational comments

గత ఐదు సంవత్సరాల పాటు మాజీ సీఎం వైయస్ జగన్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని దస్తగిరి ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో రాజీ కావాలని తీవ్రస్థాయిలో తన మీద ఒత్తిడి వచ్చిందని, అయితే నేను ఎవరితో రాజీ కావడానికి సిద్ధంగా లేనని, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి చెప్పారు. మొత్తం మీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై వివేకానంద రెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఆరోపణలు చెయ్యడం కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+