చరిత్రలో జరగలేదు: బాబుపై జగన్, ఇడుపులపాయలో చేసుకోమన్న ఉమా
హైదరాబాద్: ఏపి సిఎం చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా అని గ్రామాల్లో ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆరోపించారు.
ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత రావాడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, కానీ దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బాబు ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబును నిలదీసేందుకే డిసెంబర్ 5న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడుతున్నట్లు జగన్ తెలిపారు.

చంద్రబాబు మాటలతో రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 84మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అడ్డగోలుగా పింఛన్లు కత్తిరించారని విమర్శించారు. హుధుద్ తుఫాను బాధితుల తరపున కూడా పోరాడతామని చెప్పారు.
ఇడుపులపాయలో చేసుకోవచ్చు: దేవినేని
రుణమాఫీ అమలు కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అందుకే జగన్మోహన్ రెడ్డి రుణమాఫీకి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ దీక్ష చేయాలనుకుంటే ఇడుపులపాయలో చేసుకోవచ్చని దేవినేని సూచించారు.












Click it and Unblock the Notifications