తప్పుడు సంకేతం: జగన్‌పార్టీ ఆఫీస్ తరలింపుపై డైలమా

ఇదిలా ఉండగా.. ఈ నెలాఖరు నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయంలోని విభాగాలను, వస్తువులను తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఏమేం వస్తువులు ఉన్నాయనే విషయం నమోదు చేస్తున్నారు. వీటిని లోటస్ పాండులోని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి తరలించనున్నారు.
కొన్ని లోటస్ పాండుకు తరలించి, మిగిలినవి కార్యాలయంలోనే ఉంచి వాటిని త్వరలో ప్రకటించే ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి లేదా శాశ్వత రాజధానికి తరలిస్తారట.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొదుపు చర్యలను చేపట్టిందని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్ తన పార్టీ వ్యవహారాలకు అయ్యే ఖర్చును తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని జగన్ నిర్ణయించుకున్నారని వార్తలొచ్చాయి. ప్రస్తుత కార్యాలయం అద్దెకు, నిర్వహణకు దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని తన నివాసంలోనే ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావించారన్నారు.












Click it and Unblock the Notifications