సమైక్యం కోసం జగన్ పార్టీ నేతల రిలే నిరాహారదీక్ష
రాజమండ్రి: రాజమండ్రి నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎవి అప్పారావురోడ్‌లో రామాలయం సెంటర్లో గురువారం రిలేనిరాహారదీక్ష చేపట్టారు. ఈ రిలేనిరాహారదీక్షా శిబిరంలో పదవవార్డు ఇన్‌చార్జి కర్రి సతీష్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది మహిళలు నిరాహారదీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొమ్మన రాజ్‌కుమార్ మాట్లాడుతూ - పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ రిలేనిరాహారదీక్షలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించే వారిలో మొదటి వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఈ సందర్బంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్రసేవాదళ్ నాయుడు సుంకర చిన్ని, యువనాయకులు ఆదిరెడ్డి వాసు, మాసా రామజోగ్, కానుబోయిన సాగర్, గారపాటి ఆనంద్, నయూమ్, కోసూరి సుబ్బరాజు, వై.వి.రమణ పాల్గొన్నారు.
పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, మరిడాపు నాగమణి, మాలె విజయలక్ష్మి, చింతపల్లి నాని, కంటిపడి రాజేంద్ర, కుమార్, షేక్ మస్తాన్, ఏనుగులు, షబ్నం అప్సర్, గారా త్రినాధ్, జాలా నటరాజ్, దాసరి సాంబ, గుత్తుల మురళీధరరావు, తురకల నిర్మల తదితరులు కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications