'కేసీఆర్ ఉచ్చుతో జైలుకు చంద్రబాబు, టీడీపీ జగన్ నామస్మరణ'

గుంటూరు: ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లబోతుంటే, ఆ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు సిగ్గులేకుండా తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేస్తున్నారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆదివారం మండిపడ్డారు.

టీడీపీ నేతలు కొద్ది రోజులుగా జగన్ నామస్మరణ చేస్తున్నారని, ఎక్కడ ఏది జరిగినా దానిని జగన్‌కు ఆపాదిస్తున్నారని ఆరోపించారు. రూ.150 కోట్ల లంచాల డబ్బును పోగేసి రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు పక్కా ప్రణాళికను వేసిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికారన్నారు.

YSR Congress MLA lashes out at Chandrababu and TDP

దీని నుండి దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రం కాళ్లు పట్టుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తిట్ల దండకంతో అవమానిస్తుంటే జగన్ సమర్థిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అనడం విడ్డూరమన్నారు.

జైలుకు వెళ్లబోతూ జగన్ పైన నిందలు వేస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. గుంటూరు జిల్లా ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. కేసీఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు కేసుల నుండి తప్పించుకోవడానికి రెచ్చగొట్టవద్దన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+