హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దెబ్బకు దెబ్బ!: 'నాలుక కోస్తా', 'రోజా' వీడియో చిక్కులు తెచ్చేనా? (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా సస్పెన్షన్ అంశంపై అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం టిడిపి నేతలు రోజా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా సభలో ఏం మాట్లాడారో బహిర్గతం చేసేందుకు వీడియోను విడుదల చశారు.

దీనిపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశ్యంతోనే అసెంబ్లీలోని ఫుటేజీని బయటకు తీసుకు వచ్చామని చెప్పారు. దీనిపై వైసిపి సభ్యులు పశ్చాత్తాపపడటం లేదన్నారు. వైసిపి సభ్యులు చేసిన చేష్టలకు చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆరుగురిని జైల్లో పెట్టాల్సి వస్తుందన్నారు.

దీనిపై వైసిపి కూడా మండిపడింది. అసెంబ్లీలోని వీడియో బయటకు ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. సభాపతికి తెలియకుండా వీడియోను ఎలా విడుదల చేశారన్నారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శిని వైసిపి సభ్యులు అడిగా ఆరా తీశారు. కాగా, ఈ వీడియోలో వైసిపి అధికార పార్టీ పట్ల దారుణంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది.

ఈ వీడియో ఎపెక్ట్ ప్రతిపక్షం పైన ఏ మేరకు ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా, వైసిపి అధినేత జగన్ మధ్యాహ్నం మీడియా సమావేశంలో అధికార పార్టీ పైన దుమ్మెత్తి పోశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగలేదని, రోజాను లక్ష్యంగా చేసుకొని సస్పెండ్ చేశారని ఆరోపించారు.

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబును, దళితులను కించపరిచేలా ఎమ్మెల్యే రోజా మాట్లాడితే ఆమె నాలుక కోస్తానంటూ మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజాను చూసి చట్ట సభలకు రావాలంటే మహిళలు భయపడుతున్నారని, ఆమెపై జీవిత కాల నిషేధం విధించాలన్నారు. దళితుల ఓట్లతో ప్రతిపక్ష హోదాలో కూర్చున్న జగన్, తిరిగి వారినే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.

స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్

స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ తదితరులు బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి... సభాపతి పైన అవిశ్వాస నోటీస్ ఇచ్చేందుకు వెళ్తున్న దృశ్యం.

స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్

స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ తదితరులు బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి... సభాపతి పైన అవిశ్వాస నోటీస్ ఇస్తున్న దృశ్యం.

స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్

స్పీకర్‌పై అవిశ్వాసం నోటీస్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ తదితరులు బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి సభాపతి పైన అవిశ్వాస నోటీస్ ఇచ్చిన అనంతరం బయటకు వస్తూ...

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ జరిగిన తీరును ఆయన తప్పుబట్టారు. సభలో ఎంపిక చేసుకొని రోజాను సస్పెండ్ చేశారని, చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆరోపించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే కాల్ మనీ ఆగడాలు జరిగాయన్నారు. కాల్ మనీ వ్యాపారులకు సీఎం అండదండలు ఉన్నాయని చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అసెంబ్లీ కేవలం ఐదు రోజులే జరిపారని, ఇది సరికాదని చెప్పినా వినలేదన్నారు. కాల్ మనీ పైన అసెంబ్లీలో నిలదీయాలను మేం చూస్తే అధికార పక్షం పట్టించుకోలేదన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అసెంబ్లీకి అసలు విలువ ఉందా అని ప్రశ్నించారు. సభలో ప్రజా సమస్యలు పట్టవా అన్నారు. వడ్డీలు కట్టకుంటే మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారని, అలాంటి కాల్ మనీ పైన చర్చకు ప్రభుత్వం అంగీకరించకపోవడం ఏమిటన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

కాల్ మనీ - సెక్స్ రాకెట్లో అధికార పార్టీ నేతలు సహా చాలామంది ఉన్నారని, ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందని, అలాంటి కాల్ మనీ పైన తాము వాయిదా తీర్మానం ఇస్తే చర్చకు అనుమతించలేదన్నారు. కాల్ మనీలో టిడిపి నేతలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ముద్దాయి అని, దానిని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందన్నారు.

English summary
YSR Congress to move No Confidence motion against Speaker Kodela, TDP releases Roja's video.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X