మైనింగ్ సామ్రాట్ గాలి కుమార్తె పెళ్లికి కడప కింగ్ !

డప/బెంగళూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్. జగన్ మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి హాజరౌతున్నారని గాలి సన్నిహితులు చెప్పారు.

వైఎస్ జగన్ గాలి కుమార్తె పెళ్లికి వస్తున్న సమయంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారని గాలి వర్గీయులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలో ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం బుధవారం జరగనుంది.

ఈ శుభకార్యానికి వచ్చి తన కుమార్తెను ఆశిర్వదించాలని గాలి తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్,. జగన్, ఆయన మాతృమూర్తి వైఎస్. విజయమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించారు.

YSR Congress Party foundrer YS Jagan, Gali Janardhan Reddy’s daughter’ wedding

గాలి కుమార్తె పెళ్లికి హాజరుకావాలని వైఎస్. జగన్ నిర్ణయించారని తెలిసింది. ఈ నేపధ్యంలో ప్యాలెస్ గ్రౌండ్స్ లోని గాలి కుమార్తె పెళ్లి జరుగుతున్న చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.

జగన్ వస్తున్నందున ఆయన అభిమానులు, గాలి జనార్దన్ రెడ్డి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో పెళ్లి జరుగుతున్న చోట ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నారు.

ఇప్పటికే శుభకార్యం జరిగే చోట రెండు ప్రధాన ద్వారాలు, మూడు ఎగ్జిట్ డోర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు వందమందికి పైగా ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు బౌన్సర్లను పెడుతున్నారని సమాచారం.

వైఎస్. జగన్ గాలి కుమార్తె పెళ్లికి తప్పకుండా హాజరౌతారని, ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, శాసన సభ్యులు హాజరయ్యే అవకాశం ఉందని గాలి అనుచరులు అంటున్నారు. మొత్తం మీద గాలి కుమార్తె పెళ్లికి జగన్ హాజరౌతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+