జగన్ పార్టీ నేత హత్య: కారులో వచ్చి కాల్చేశారు

గమనించిన స్థానికులు శ్రీశైల వాసును హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, శ్రీశైలం వాసుకు పలు వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నట్లు తెలిసింది. ఆర్థిక లావాదేవీలే శ్రీశైలం హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
శ్రీశైలవాసు చందాపురం వాసి.
వాసుకు వ్యాపార భాగస్వామి, అనుచరుడైన హైదరాబాద్‌కు చెందిన ఉన్నం హనుమంతరావుతోపాటు మరో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనతో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలవాసు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గతంలో కాంగ్రెస్ జాతీయ ఉక్కు మండలి సభ్యునిగా పని చేసిన శ్రీశైలవాసు ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
కాగా, శ్రీశైలవాసు హత్య నేపథ్యంలో విజయవాడ, నందిగామ పోలీసులు అప్రమత్తయ్యారు. రహదారులపై టోల్ గేట్లు మూసివేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. జాతీయ రహదారులపై కూడా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. శ్రీశైలవాసు చందాపురం వాసి.
ఇద్దరు నిందితుల అరెస్ట్
శ్రీశైల వాసును హత్య చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను నల్గొండ జిల్లా కోదాడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో శ్రీశైలవాసు మేనల్లుడు అయిన హన్మంతరావు, మరొకరు ఉన్నారని తెలిసింది. రూ. కోటి శ్రీశైలవాసు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నందునే హన్మంతరావు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. డబ్బు కోసమే నందిగామలోని శ్రీశైలవాసు ట్రాక్టర్ ఏజెన్సీ వద్దకు వచ్చి అతనితో మాట్లాడిన అనంతరం నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. హన్మంతరావు సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications