వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెజెండ్‌‌లో రాజకీయ డైలాగ్స్: జగన్ పార్టీ, ఈసి పరిశీలన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నటించిన ‘లెజెండ్' సినిమాపై ఎన్నికల సంఘానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేస్తున్నందున ఎన్నికలయ్యే వరకు సినిమా నిలిపేయాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో లెజెండ్ సినిమాను ఎన్నికల సంఘం అధికారులు వీక్షించారు. లెజెండ్ సినిమాలో రాజకీయ డైలాగులు ఉన్నాయని, అందువల్ల ఎన్నికలు అయ్యే వరకు సినిమాను నిలపేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు.

YSR Congress Party leaders complains on Balakrishna's 'Legend'

లెజెండ్ సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, అందువల్ల ఎన్నికలు అయ్యే వరకు లెజెండ్ సినిమాను నిషేధించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం అధికారులు లెజెండ్ సినిమాను పరిశీలించారు. అనంతరం సినిమాపై ఓ నివేదికను తయారు చేసి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్‌కు అందజేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ, సీమాంధ్రల్లో నామినేషన్ ఘట్టు కూడా పూర్తయింది. తెలంగాణలో ఏప్రిల్ 30న, సీమాంధ్రలో మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమాను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసిని కోరింది.

English summary
YSR Congress Party leaders on Thursday complained on Cine Actor and Telugudesam Party leader Balakrishna's 'Legend' cinema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X