రోజా రాజకీయం: నాడు చిరు, నేడు బాబు (ఫోటోలు)
తిరుపతి: సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఆర్.కే. రోజా రాజకీయ రంగప్రవేశం రచ్చరచ్చగానే మొదలై, రచ్చరచ్చగానే సాగుతోంది. సినీరంగంలో అడుగు పెట్టడానికి కారణం అయిన డాక్టర్ శివప్రసాద్ రోజాకు రాజకీయంగాను గురువు అయ్యారు.
రోజాను రాజకీయాలలోకి తీసుకు వచ్చింది ప్రస్తుత చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు (టీడీపీ) డాక్టర్ శివప్రసాద్. అప్పటి నుంచి ప్రతిపక్షాల మీద రోజా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆమె గతంలో తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించారు.
2004లో చిత్తూరు జిల్లాలోని నగిరి నుంచి, 2009లో చంద్రగిరి నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటి చేసి ఓడిపోయారు. 2009 శాసన సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మీద రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు
రెండు సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోజాకు ఆ పార్టీలో సముచిత స్థానం కల్పించారు. రోజాను ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిని చేశారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై విసుర్లు
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు (అప్పట్లో) మెగాస్టార్ చిరంజీవి మీద రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అదే పనిలో చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ పైన మండిపడ్డారు.

చిరుతో కలిసి నటించినా వదల్లేదు
రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నారని చిరంజీవిని విమర్శించారు. చిరంజీవిని నోటికి వచ్చినట్లు విమర్శించారు

తిరుపతిలో పోటాపోటీ ప్రసంగాలు
2009లో చిరంజీవి తిరుపతి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆ సందర్బంలో టీడీపీ నుంచి పక్క నియోజక వర్గం చంద్రగిరి నుంచి పోటీ చేసిన రోజా చిరంజీవి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు, బాలయ్య అండ
అప్పట్లో ఎన్నికల్లో ఓడిపోయినా రోజాకు టీడీపీలో మంచి గుర్తింపు వచ్చింది. ఆమెకు చంద్రబాబుతో పాటు బాలయ్య మద్దతు ఇచ్చారు.

మహిళా నేతలు జీర్ణించుకోలేకపోయారు
టీడీపీలోని మహిళా నేతలు రోజా తీరును జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి వారి మద్య అంతర్గత పోరు నడిచింది.

వైఎస్ఆర్ తో భేటీ
టీడీపీలో తాను ఉండలేనని భావించిన రోజా రెండవ సారి ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో భేటీ అయ్యారు. తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

జగన్ సమక్షంలో
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా మరణించడంతో తరువాత రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నగిరి నుంచి పోటీ
2014 శాసన సభ ఎన్నికల్లో నగిరి నుంచి పోటీ చేసిన రోజా తమ సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై 858 ఓట్లతో గెలుపోందారు.

మొదటి నుంచి వివాదమే
రోజా రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.












Click it and Unblock the Notifications