విభజన దిశగా 'జగన్' రిజైన్ వ్యూహం, ఢిల్లీ డైరెక్షనా?

సమైక్యాంధ్ర అంటూనే రాజీనామాల ఆమోదానికి ప్రయత్నించడం ద్వారా విభజనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరోక్షంగా సహకరిస్తుందేమో, కాంగ్రెసు అధిష్టానంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇలా జరుగుతున్నట్లుగా ఉందని పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకిస్తారు కనుక సభ ఆమోదం తెలపడం అసాధ్యమని సమైక్యవాదులు భావిస్తున్నారు.
జగన్ పార్టీ ఎమ్మెల్యేలు 17 మంది రాజీనామాలను ఆమోదింప చేసుకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితి ఎదురువుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి 15 ఖాళీలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించుకుంటే 32కు చేరుతాయి. అప్పుడు రెండు ప్రాంతాల మధ్య ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో 24 మాత్రమే తేడా ఉంటుంది.
పదమూడు మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజడనకు అంగీకరిస్తే కాంగ్రెసు అధిష్టానం కోరుకున్నట్లుగా తెలంగాణ ఏర్పాటుకు అసెంబ్లీ నుండి కూడా పచ్చజెండా వస్తుంది. జగన్ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే... విభజనకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు అధిష్టానానికి పెద్ద కష్టమేమీ కాదని సీమాంధ్రకు చెందిన పలువురు నాయకులు అనుమానిస్తున్నారంటున్నారు. అదే సమయంలో రాజీనామాలు ఆమోదించుకోవడం ద్వారా సీమాంధ్రలో జగన్ పార్టీ ఛాంపియన్‌గా నిలుస్తుంది.












Click it and Unblock the Notifications