వైసీపీ ఆఫీస్ మారింది, కేసీఆర్‌కు దమ్ములేదని బొజ్జల

హైదరాబాద్/న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఖాళీ చేసి లోటస్ పాండుకు తరలించారు. లోటస్ పాండులోనే ఉన్న ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పీఎన్వీ ప్రసాద్ ఆదివారం ప్రకటించారు.

ఆదివారం నాడి నుండే లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ కేంద్ర కార్యాలయాన్ని ఏపీలోని విజయవాడకు తరలించేంత వరకు పార్టీ కార్యక్రమాలను ఇక్కడి నుండే చేపట్టనున్నారు. కాగా, గతంలో ఆ పార్టీ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో ఉండేది.

దమ్ము లేదు: బొజ్జల

విజయవాడలో సభ పెట్టే దమ్ము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోమవారం అన్నారు. కేసీఆర్‌ చేతకానితనం వల్లే శ్రీశైలం జలవిద్యుత్‌ వివాదం నెలకొందని ఆయన మండిపడ్డారు.

YSR Congress Party office shifted to Lotus Pond

తెలంగాణలో కరెంట్‌ కష్టాలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. కేసీఆర్‌ కరెంటు కావాలని ఎప్పుడైనా తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అడిగారా అని బొజ్జల ప్రశ్నించారు. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుంది కేసీఆర్‌ పాలన అని దుయ్యబట్టారు. కుప్పంలో ఏనుగుల దాడుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ఎర్రచందనం టెండర్లు కొలిక్కి వచ్చాయని మంత్రి బొజ్జల తెలిపారు.

కేంద్రమంత్రి ఉమాభారతితో మంత్రి హరీష్‌రావు భేటీ

కేంద్రమంత్రి ఉమాభారతితో తెలంగాణ మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. శ్రీశైలం నీటి వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఉమాకు ఫిర్యాదు చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు ఏపీ పూర్తిగా గండికొడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

శ్రీశైలంలో 3టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుని విద్యుదుత్పత్తిని నిలిపివేయాలన్న కృష్ణా రివర్‌ బోర్డు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణకు అన్యాయం చేసేలా ఉందని తెలిపారు. తెలంగాణకు న్యాయం జరిగిలే కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా రివర్‌ బోర్డు ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచి విద్యుదుత్పాదనకు అనుమతివ్వాలంటూ మెమోరాండంను కేంద్రమంత్రి ఉమా భారతికి అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+