హైటెక్ ఇళ్లు వచ్చాయా?: ఏపీ ప్రజలకు వైసిపి లేఖ, బాబుపై ఆగ్రహం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు గురువారం నాడు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైసిపి చంద్రబాబుకు 15ను ప్రశ్నలను విడుదల చేశారు.

చంద్రబాబు చేసిన ప్రధానమైన 15 వాగ్ధానాల పైన జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడో విడత జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు నిలదీయాలని విజ్ఞప్తి చేసింది. రెండు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో మొత్తంగా 13 జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదులు 33 వేలు ఉండగా, 28వేలు పెండింగులో ఉన్నాయన్నారు.

YSR Congress

మూడో విడత జన్మభూమి అంటూ డ్రామాలు మొదలు పెడుతున్నారన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మూడో విడత జన్మభూమి అని వస్తే ప్రజలు నిలదీయాలని, ఇందుకు పదిహేను ప్రశ్నలను విడుదల చేసింది.

మీ వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? కనీసం వడ్డీ మాఫీ అయిందా?
డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా?
ఇంటికో ఉద్యోగం వచ్చిందా? నిరుద్యోగులకు రూ.2వేల భృతి ఇస్తున్నారా?
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారా?
బెల్టు దుకాణాలు రద్దయ్యాయా?
పేదలందరికీ హైటెక్ ఇళ్లు ఉన్నాయా? ఎవరికైనా ఇచ్చారా?
గ్యాస్ సిలిండర్ పైన రూ.100 సబ్సిడీ ఇస్తున్నారా?
ఇంటింటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తున్నారా?
బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టారా?
కాపులను బీసీల్లో చేర్చారా?
మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కదలిక కనిపిస్తోందా?
నేత కార్మికులకు ఉచిత విద్యుత్ వస్తోందా?
భూమిలేని పేదవారికి రెండు ఎకరాల భూమి ఇచ్చారా?
లారీ, ట్యాక్సీ, ఆటో డ్రైవర్ల వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇచ్చారా?
అవినీతిలేని పాలన కనిపిస్తోందా?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+