వ్యతిరేకంగా ఇస్తే ఛానళ్లను మూసేస్తారా?: బాబును నిలదీసిన జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శనివారం నాడూ వాడీవేడిగా సాగాయి. ఫైబర్ గ్రిడ్, ఈ-ప్రగతిపై శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు గుప్పించారు.

టీవీ చానళ్లను నియంత్రించేందుకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను తెరమీదకు తెచ్చారని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదైనా చూపిస్తే ఆ ఛానళ్లను కట్ చేసేందుకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అని అన్నారు. బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్ వేర్ సంస్థకు కాంట్రాక్ట్ ఎలా అప్పగించారని వైయస్ జగన్ ప్రశ్నించారు.

వందల కోట్ల స్కామ్ జరిగిందని, టెరా సాఫ్ట్ వేర్ సంస్థను నిరుడు బ్లాక్ లిస్టులో పెట్టారని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. అదే సంస్థకు మరలా ఫైబర్ గ్రిడ్ పనులు ఎలా అప్పగిస్తారని వైయస్ జగన్ నిలదీశారు. హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి ఈ సంస్థను నడిపిస్తున్నారని, ఆయన గతంలో ముంబైలో ఈవీఎం మిషన్‌లు దొంగతనం చేస్తు దొరికిపోయారని తెలిపారు.

YSR Congress Party president YS jagan fires at AP CM Chandrababu naidu

హరికృష్ణ ప్రసాద్‌పై కేసులు కూడా నమోదు అయ్యాయన్నారు. ఫైబర్ గ్రిడ్ ఉన్నతస్థాయి కమిటీలో హరికృష్ణ ప్రసాద్‌ను సభ్యుడిగా నియమించారని, అలాగే టెరా సాఫ్ట్ వేర్ సంస్థ కూడా ఆయనదేనని అన్నారు. ఆ సంస్థకే ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులు ఇప్పించారన్నారు. ఇంతకంటే దారుణం ఏదీ ఉండదని జగన్
అన్నారు.

కోర్ డాష్ బోర్డు గతంలోనే ఉందని, ఆ బోర్డును చంద్రబాబే తయారు చేసినట్లు చెప్పుకొస్తున్నారని అన్నారు. మొబైల్‌లో యాప్‌లు ఎలా వాడాలో కూడా చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పేరుతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు. కాగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని, వైయస్ జగన్‌పై ఆరోపణలకు దిగారు. దీంతో వైయస్సార్ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+