వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మాట్లాడుతుంటే కనీస మర్యాద ఏది: వైఎస్సార్సీపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతుండగా కనీస మర్యాద లేకుండా శాసన సభను అర్ధాంతరంగా వాయిదా వేయడం ఎంత వరకు సమంజసమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం ప్రశ్నించింది. అంతకుముందు జగన్ మాట్లాడుతున్న సమయంలో సభాపతి సభను మంగళవారానికి వాయిదా వేశారు.

వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట్లాడింది. సభ వాయిదా తీరు బాధాకరమన్నారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే కనీస మర్యాద ఇవ్వకుండా వాయిదా వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అధికార పార్టీ తీరు బాగా లేదన్నారు. జగన్ మాట్లాడుతుండగా 17సార్లు ఆటంకం కలిగించారన్నారు.

 YSR Congress Party question adjourning

ధన్యవాద తీర్మాన చర్చలో టిడిపి నేతలు కనీస మర్యాదలు పాటించలేదన్నారు. జగన్ మాట్లాడుతుంటే సభ్యులు పదే పదే అడ్డుకున్నారన్నారు. అభద్రతా భావం కలిగించే రీతిలో అధికార పార్టీ మాట్లాడిందన్నారు. వేర్వేరు సంస్థలు ఇచ్చిన నివేదికలను సభలో జగన్ ప్రస్తావించారన్నారు. ఇచ్చిన హామీలు దాటవేసేలా టిడిపి తీరు ఉందన్నారు. సభను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సభాపతిని ఉద్దేశించి అన్నారు.

సభాపతి ప్రత్యక్షంగా, పరోక్షంగా తమకు అంతరాయం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన స్పీకరా లేక శాసన సభ వ్యవహారాల మంత్రియా అన్నారు. సభా వ్యవహారాల మంత్రిలా మాట్లాడుతున్నారన్నారు. జగన్ మాట్లాడుంటే వాయిదా వేయడమన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ పెంపును స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం చేసే మంచి పనులకు తమ సహకారం ఉంటుందని చెప్పారు.

English summary
YSR Congress Party leaders question adjourning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X