సిబిఐ విచారణకు సిద్ధమా?: బాబుపై అంబటి

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఎన్ని భూములు కొన్నారో సిబిఐ విచారణకు సిద్దామా అని సవాల్ విసిరారు. చంద్రబాబునాయుడు తాబేదార్లు కొన్న భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
రాజధాని నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములివ్వడానికి రైతులు సుముఖంగా లేరని చెప్పారు. భూముల సమీకరణపై రైతాంగం తీవ్ర భయాందోళనకు లోనవుతోందని అన్నారు. రైతులకున్న అనుమానాలు తీర్చడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని అంబటి అన్నారు.
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు వందల ఎకరాలు భూములు కొన్నట్లు అక్కడి ప్రజలు పేర్లతో సహా చెబుతున్నారని, ఇది వాస్తవం కాదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఇతరులపై నిందలు వేయడం సరికాదని, వాస్తవ దృక్పథంతో ఆలోచించాలని సూచించారు.
రైతుల్లో నమ్మకం కలిగిస్తే వారే స్వచ్ఛందంగా భూములు ఇస్తారని చెప్పారు. పంట భూముల్లో కాకుండా నిరుపయోగంగా ఉన్న భూముల్లో రాజధాని నిర్మాణం జరగాలని అంబటి రాంబాబు అన్నారు.












Click it and Unblock the Notifications