సెక్షన్ 8: టీడీపీకీ జగన్ పార్టీ అండ! ఏడాదిగా ఇదీ కేసీఆర్: జూపూడి

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్న తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు లభించిందని చెప్పవచ్చు. ఆ పార్టీకి చెందిన జ్యోతుల నెహ్రూ మంగళవారం నాడు సెక్షన్ 8 అంశంపై మాట్లాడారు.

హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు. అయితే, ఓటుకు నోటు వ్యవహారం నుండి తప్పించుకునేందుకే చంద్రబాబు సెక్షన్ 8 తెరపైకి ఇప్పుడు తీసుకు వచ్చారని, ఇప్పటి వరకు ఎందుకు గుర్తుకు రాలేదని వైసీపీ ప్రశ్నించింది. అయితే, సెక్షన్ 8 అమలుపరచాలనే డిమాండ్‌ను మాత్రం చేసింది.

టీఆర్ఎస్ నేతలు ఎవరు?: జూపూడి

YSR Congress too demand section 8 in Hyderabad

సెక్షన్‌ 8 అమలు చేయాల్సిందేనని, ఒప్పుకోకపోవడానికి తెరాస నేతలు ఎవరని టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు వేరుగా ప్రశ్నించారు. స్థానికత, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, గురుకుల్‌ భూముల్లో ఇళ్ల కూల్చివేతలు ఇవన్నీ సెక్షన్‌ 8 కిందకు రావా? అన్నారు.

హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు చేయాలని కేంద్రమే చెప్పిందని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారన్నారు. హైదరాబాద్‌లో ఏడాదిగా ఉల్లంఘనలు జరిగాయనడానికి కేసీఆర్‌ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేయడమే నిదర్శనమన్నారు.

రాజ్యాంగం తమకు వర్తించదని టీఆర్‌ఎస్‌ భావిస్తోందా? అని అడిగారు. ధర్నాలు చేస్తే ఢిల్లీ సీఎం మాదిరిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభాసుపాలవుతారన్నారు. సెక్షన్‌ 8 రాజ్యాంగ హక్కని, ఎవరి ఇష్టాయిష్టాలతో పని లేదన్నారు. ఏపీ ఫోన్లు ట్యాప్‌ చేసి, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారన్నారు. సెక్షన్ 8 పైన జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+