ఎన్టీఆర్ కంటే వైయస్ గొప్పా: గాలి, చంద్రబాబు భయపడ్తున్నారు: వైసీపీ
హైదరాబాద్: నీలం సంజీవరెడ్డి, ఎన్టీఆర్‌ల కంటే వైయస్ రాజశేఖర రెడ్డి గొప్పవారా అని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆదివారం ప్రశ్నించారు. అసెంబ్లీలో వైయస్ ఫోటో తొలగించడంపై వైసీపీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో ఫోటోల అంశంపై కమిటీ నిర్వహిస్తే అందరి సిఎంల ఫోటోలు పెడతామని చెప్పారు. వైయస్ ఫోటో తొలగింపుపై వైసీపీది అనవసర రాద్ధాంతం అన్నారు. ఏ ముఖ్యమంత్రి ఫోటో అసెంబ్లీలో లేదని చెప్పారు. హోదా పైన ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కార్చుతున్నాయన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ధర్నా చేస్తున్నారన్నారు.
నిమ్మల కిష్టప్ప కారును అడ్డుకన్న ఏఐఎస్ఎఫ్
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురం జిల్లా కదిరిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప కారను వారు అడ్డుకున్నారు. ఎంపీ అనుచరులు, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

చంద్రబాబు పైన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం
ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో తప్పులు చేసి చిక్కుల్లో ఇరుక్కున్న చంద్రబాబు ఏం మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని భయపడుతున్నారని, అందుకే కేంద్రం ముందు మౌనంగా చేతులు కట్టుకొని నిలబడుతున్నారన్నారు.
ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. సోమవారం ఢిల్లీలో హోదా కోసం ధర్నా చేపడుతున్నామని తెలిపారు. ప్రత్యేక హోదా వస్తే గాని ఏపీలో పారిశ్రామిక అభివృదధి సాధ్యం కాదని, కేంద్రానికి వెళ్లే ఆదాయం నుంచి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు వాటా దక్కుతుందన్నారు. కేంద్రం 90 శాతం గ్రాంట్, 10 శాతం లోన్ ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications