మీకు విలువుందా?: పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేకు ఓటర్లు షాక్
చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో చేరిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి వైసిపి నుంచి పోటీ చేసి గెలిచారు. గురువారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు.
ఈ నేపత్యంలో వి.కోటలో వైసిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అమర్నాథ్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయన తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వైసిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.

అంతేకాదు, వి.కోటలో వైసిపి కార్యకర్తలు ఓ పెద్ద బ్యానర్ కట్టారు. అందులో.. ఆ రోజు పార్టీలోకి మిమ్మల్ని ఎవరూ రమ్మని చెప్పలేదని, అలాగే ఈ రోజు మీరు వెళ్తామంటే ఆపేది లేదని, కానీ మిమ్మల్ని మేం ఓట్లు వేసామని, మా ఓట్లు మాకు ఇచ్చి వెళ్లాలన్నారు.
జగన్! నా నోటికి పని చెప్పకు: సైకిలెక్కిన అమర్నాథ్, నెల్లూరు కీలక నేత ఝలక్
మేం మిమ్మల్ని వైసిపి అభ్యర్థిగా గెలిపించామని, అది గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అమర్నాథ్ రెడ్డి పార్టీ మారతారో లేక గంగలో దూకుతారో మాకు అనవసరమని, అది ఆయన ఇష్టమని, కానీ మా ఓటు మాకు తిరిగి ఇచ్చేసి పార్టీ మారాలని సూచించారు. ఓటుకు విలువ ఉందని, తరుచూ పార్టీ మారే ఎమ్మెల్యేగా మీకు విలువ ఉందా.. సిగ్గు.. సిగ్గు అని అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications