'09 తర్వాత ఇదీ లెక్క!: జగన్‌వైపు 33, బాబువైపు 27

ఇప్పటి వరకు 2009లో కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచిన 33 మంది సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెసులో, 27 మంది టిడిపిలో చేరినట్లుగా తెలుస్తోంది. ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు జగన్ పార్టీ వైపు వెళ్లారు. తెలంగాణ విషయానికి వస్తే... నలుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు, 14 మంది టిడిపి ఎమ్మెల్యేలు తెరాసల చేరారు. ఒక టిడిపి ఎమ్మెల్యే బిజెపిలో చేరగా, మరో టిడిపి ఎమ్మెల్యే, ఒక తెరాస ఎమ్మెల్యే కాంగ్రెసు పార్టీలో చేరారు.
సీమాంధ్రలో.... ఒక కాంగ్రెసు ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఇప్పటి వరకు దాదాపు 88 మంది ఎమ్మెల్యేల వరకు పార్టీలను ఫిరాయించారు. టిడిపి 22 మంది ప్రజాప్రతినిధులను కోల్పోయి... 27 మందిని పార్టీలో చేర్చుకుంది.
పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే... ముగ్గురు ఎంపీలు జగన్ పార్టీలో, ఇద్దరు తెరాసలో, ఇద్దరు జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఒక ఎంపీ (పురంధేశ్వరి) బిజెపిలో చేరారు. కావూరి సాంబశివ రావు అదే బాటలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక తెరాస ఎంపి విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరారు.
అయితే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కొందరు ఆ పార్టీకి రాజీనామా చేసి.. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున గెలుపొందిన వారు ఉన్నారు. 2009కు ముందు టిడిపిని వదిలిన పలువురు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇప్పుడు వారిలో ఎక్కువ మంది మళ్లీ టిడిపిలోకి వస్తున్నారు.












Click it and Unblock the Notifications