ఆ నిర్ణయమే జగన్ రాజకీయ భవిష్యత్ కు కీలక మలుపు..!!
జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
ఒన్ మ్యాన్ ఆర్మీ. వైఎస్ జగన్. తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం. తండ్రి మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయంగా నాడు తీసుకున్న నిర్ణయం నేడు కోట్లాది మందికి అభిమాన నేతగా మార్చింది. తల్లితో కలిసి ప్రారంభించిన ఆ రాజకీయ యాత్రలో లక్షలాది మంది కలిసొచ్చారు. ఒంటరిగా ప్రారంభించిన ఆ పోరాటం ప్రభజనంగా మారింది.
ఒక్క ఎమ్మెల్యే..ఒక్క ఎంపీగా ప్రారంభమైన వైసీపీ ప్రస్థానం రికార్డు స్థాయి విజయంతో సీఎం స్థానం అందుకున్నారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం జగన్ తీసుకున్న వైఎస్సార్సీపీ ఏర్పాటు నిర్ణయం..రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారింది. జగన్ ప్రజా బలం ఏంటో చాటింది. తిరుగు లేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది.
ప్రత్యర్థులను చిత్తు చేస్తూ..13 ఏళ్లుగా
2009, సెప్టెంబర్ 2. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్సార్ ఆకస్మిక మరణం రాష్ట్రంలో భారీ కుదుపు. వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ ఆ పార్టీని వీడారు. ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి సాక్షిగా 2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్సీపీని ప్రకటించారు. కాంగ్రెస్ ను ధిక్కరించారు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకే ముచ్చెమటలు పట్టించారు. జగన్ పైన కేసులు పెట్టారు. జైలుకు పంపారు.
అవమానాలకు గురి చేసారు. అన్నింటినీ భరించారు. ఎదురొడ్డి నిలబడ్డారు. నిత్యం ప్రజల మధ్యనే ఉన్నారు. తనదైన వ్యూహంతో ఎప్పటికప్పుడు ప్రత్యర్థులను చిత్తు చేస్తూనే ఉన్నారు. ప్రజాభిమానం గమనించిన టీడీపీ-కాంగ్రెస్ లోని నేతలు జగన్ కోసం ఆ పార్టీలను ఎదిరించారు. అనర్హత వేటు పడినా..ప్రజలు మద్దతుగా నిలిచారు.
18 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ 15 స్థానాలు గెలిచింది. 2014లో స్వల్ప తేడాతో ప్రతిపక్ష హోదాకు పరిమితం అయింది. కానీ, పోరాటం ఆగలేదు. అధికారం దక్కించుకొని అందరికీ అదే సమాధానంగా భావించిన జగన్ ఆ లక్ష్యం సాధన కోసం పోరాటం కొనసాగించారు.
ఒన్ మ్యాన్ ఆర్మీ..వెనుకడుగు లేదు
వైసీపీ అధినేతగా జగన్ ఈ 13 ఏళ్ల కాలంలో ఎన్నో సవాళ్లు, ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డారు. విశ్వసనీయత ఆయుధంగా ప్రజల నమ్మకాన్ని పెంచుకున్నారు. ప్రతిపక్షాలకు లేనిదీ..తనకు ఉన్నది ఆ విశ్వస నీయతే అంటూ ప్రజల మధ్యన నిలిచారు. తనను వేధించిన 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకే ముచ్చెమటలు పట్టించింది జగన్ పార్టీ.
తన పైన నమ్మకం నిలబెట్టుకోవటం..ధృడమైన విశ్వాసాన్ని కలిగించ టంలో జగన్ సక్సెస్ అయ్యారు. పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుంచి ప్రజల మధ్యే ఉన్నారు. ప్రతిపక్ష నేతగా తిరిగి సుదీర్ఘ పాదయాత్ర చేసారు. ప్రజలకు దగ్గరయ్యారు. తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ వైఫల్యాలను వివరించారు. రికార్డు స్థాయి పాదయాత్రతో తన పార్టీని దేశంలని అతిపెద్ద పార్టీల సరసన చేర్చారు.
రాష్ట్ర చరిత్రలోనే 51 శాతం ఓట్లు, 80 శాతం పైగా సీట్లతో 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 స్థానాలతో, భారత లోక్‌సభలో 22 స్థానాలతో అత్యున్నత ఫలితాలు అందుకుంది. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది.
అసలు పరీక్ష.. వై నాట్ 175
13వ వార్షికోత్సవ వేళ వైసీపీ అధినేతగా జగన్ ముందు ఇప్పుడున్న అసలు లక్ష్యం 2024 ఎన్నికలు. కష్టపడి దక్కించుకున్న అధికారం నిలబెట్టుకోవటం. వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకెళ్తున్నారు. ప్రజలు తనకు మద్దతుగా నిలుస్తారనే ధీమాతో ఉన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేసామని చెబుతున్నారు.
ప్రతీ ఇంటికి మేలు చేసామని ప్రకటించారు. మేలు జరిగిందని నమ్మితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలు పొత్తులు కట్టినా..తాను ఒంటరిగానే సింహంలా పోరాటం చేస్తానని స్పష్టం చేసారు. తాను ప్రజలను..దేవుడిని నమ్ముకున్నానని పదే పదే చెబుతున్నారు. తాను అమలు చేస్తున్న సామాజిక న్యాయం మేలు చేస్తుందని భావిస్తున్నారు. పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు..సంక్షేమం ప్రజలు ఆదరించారని విశ్వసిస్తున్నారు.
పెట్టుబదుల సదస్సు ద్వారా తన పైన ఉన్న విమర్శలకు సమాధానం చెప్పారు. ఇక చేయాల్సింది పొలిటికల్ మేనేజ్ మెంట్. సోషల్ ఇంజనీరింగ్. మిగిలిన ఏడాది సమయం ఇప్పుడు కీలకం. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నాడు ఇప్పుడు వైసీపీ నేతలంతా జగన్ నిర్ణయాల వైపే చూస్తున్నారు. జగన్ ప్రజాకర్షణ మంత్ర తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే జగన్ రాజకీయ జీవితానికి మరో మలుపు కానుంది.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications