Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వర్రా రవీంద్ర రెడ్డికి రిమాండ్: కోర్టులో షాకింగ్ స్టేట్‌మెంట్‌

Varra Ravindra Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీంద్ర రెడ్డి రిమాండ్ అయ్యారు. ఆయనను 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. దీనితో పోలీసులు ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సోషల్ మీడియా కార్యకర్తలు సుబ్బారెడ్డి, ఉదయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

YSRCP activist Varra Ravindra Reddy remand for 14 days

ఈ సందర్భంగా వర్రా రవీంద్ర రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు మెజిస్ట్రేట్. మిగిలిన ఇద్దరు సుబ్బారెడ్డి, ఉదయ్‌కు 41 ఏ కింద నోటీసులను ఇచ్చి విడుదల చేయాలని చెప్పారు. రిమాండ్‌లోకి తీసుకున్న తరువాత తొలు వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

వర్రా రవీంద్ర రెడ్డి స్టేట్‌మెంట్‌ను మెజిస్ట్రేట్ రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక అంశాలను బయటపెట్టినట్లు న్యాయవాది వెల్లడించారు. పోలీసులు తనను కొట్టారని, గాయపరిచారని స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు చెప్పారు. అరికాళ్లపై కొట్టారని, తొడలపై నిల్చొని కాళ్లతో తొక్కారని మెజిస్ట్రేట్‌కు వివరించినట్లు న్యాయవాది పేర్కొన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతపై పోస్టులు పెట్టినట్లు అంగీకరించాలని పోలీసులు తీవ్ర ఒత్తిడి చేసినట్లు వర్రా రవీంద్రా రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు.

ఈ పోస్టుల వెనుక వైసీపీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్పాలంటూ తనను వేధింపులకు గురి చేశారని చెప్పాలంటూ వర్రాను ఒత్తిడి చేశారని అన్నారు. ఒకవేళ ఒప్పుకోకపోతే కుటుంబంలోని మహిళలపై వేధింపులు ఉంటాయని బెదిరించినట్లు చెప్పారు. ఆయన స్టేట్‌మెంట్‌ను మెజిస్ట్రేట్ రికార్డ్ చేశారని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+