‘ఉపరాష్ట్రపతి వస్తే! వైయస్ జగన్‌కు ఆహ్వానం ఇలాగేనా?’

ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చిన వెంకయ్యనాయుడిని శనివారం ప్రభుత్వం ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిన

అమరావతి: ఉపరాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చిన వెంకయ్యనాయుడిని శనివారం ప్రభుత్వం ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాకపోవడంపై ఆ పార్టీ వివరణ ఇచ్చింది.

ఆహ్వానం ఇలాగేనా?

ఆహ్వానం ఇలాగేనా?

తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సరైన రీతిలో ఆహ్వానం అందకపోవడం వల్లే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మాన సభకు హాజరుకాలేదని వైయస్సార్ కంగ్రెస్ పార్టీ వర్గలు తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేతను సీఎం లేదా మంత్రులు ఆహ్వానించడం ఆనవాయితీ అని చెప్పారు.

అవే సంకేతాలిచ్చినట్లయింది..

అవే సంకేతాలిచ్చినట్లయింది..

వెంకయ్య సన్మాన కార్యక్రమ తేదీ ఎప్పుడో ఖరారైనా.. కేవలం ఒక్కరోజు ముందే అది కూడా సాయంత్రం మెయిల్ ద్వారా ఆహ్వానం పంపినట్లు వైసీపీ నేతలు తెలిపారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదన్న సంకేతాలను ప్రభుత్వమే ఇచ్చినట్లుగా ఉందని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

జగన్ ప్రత్యేక అభినందనలు

జగన్ ప్రత్యేక అభినందనలు

సన్మాన కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కానప్పటికీ వెంకయ్యనాయుడు విషయంలో ప్రతి సందర్భంలోనూ సముచిత గౌరవం ఇచ్చారని ఆయన తెలిపారు. అంతేగాక, వెంకయ్యనాయుడికి జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారని చెప్పారు. వెంకయ్య పేరును ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించినప్పుడు తమ పార్టీ ముందే మద్దతు ప్రకటించినట్లు చెప్పారు.

ఘన సన్మానం..

ఘన సన్మానం..

కాగా, శనివారం అమరావతిలో వెంకయ్యనాయుడుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడుతోపాటు ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, కేంద్రమంత్రులు అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి, సభాపతి కోడెల శివప్రసాదరావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+