వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

82,888 వేలు దాటిన విక్రమ్ రెడ్డి మెజార్టీ - వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్ధి : గౌతమ్ ను దాటేసి కొత్త రికార్డు..!!

|
Google Oneindia TeluguNews

ఆత్మకూరు లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ముందంజలో ఉన్నారు. భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. మొత్తం 20 రౌండ్ల కౌంటింగ్ లో భాగంగా 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. వైసీపీ అభ్యర్ధి ఇప్పటి వరకు 50 వేల మెజార్టీతో ఉన్నారు. ఇంకా పది రౌండ్లు లెక్కించాల్సి ఉంది. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ ఉండగా.. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్ధి నిలిచారు. బీజేపీ అభ్యర్ధి ఏడో రౌండ్ లో మాత్రమే చెప్పుకోదగిన పోటీ ఇచ్చారు. తొలి రౌండ్ నుంచి ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. వైసీపీ ఈ ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గౌతమ్ రెడ్డి కంటే అధిక మెజార్టీతో

గౌతమ్ రెడ్డి కంటే అధిక మెజార్టీతో

మంత్రిగా ఉంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. గౌతమ్ సోదరుడు విక్రమ్ ను వైసీపీ ఇక్కడ అభ్యర్ధిగా బరిలోకి దించింది. 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ఎన్నికల్లో 22, 276 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గౌతమ్ రెడ్డికి 92,758 ఓట్లు రాగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లినేని క్రిష్ణయ్య కు 70,482 ఓట్లు వచ్చాయి. ఇక, బీజేపీ నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కర్నాటి ఆంజనేయ రెడ్డికి 2314 ఓట్లు దక్కాయి. అయితే, ఇప్పుడు టీడీపీ - జనసేన బరిలో లేకపోవటంతో బీజేపీ అభ్యర్ధికి గతం కంటే ఎక్కువ ఓట్లు పోలయినట్లు స్పష్టం అవుతోంది. కానీ, విక్రమ్ రెడ్డి తన తొలి ఎన్నికల్లోనే రికార్డు స్థాయి మెజార్టీ దక్కించుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా

తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా


2014 ఎన్నికల్లోనూ ఆత్మకూరు లో గౌతమ్ రెడ్డి 31,412 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు విక్రమ్ రెడ్డి తన సోదరుడు గౌతమ్ రెండు ఎన్నికల్లోనూ సాధించిన మెజార్టీని దాటేసారు. విక్రమ్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతుండటంతో బీజేపీ అభ్యర్ధి భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయిదో రౌండ్ వరకు 21 వేలకు పైగా మెజార్టీ సాధించిన విక్రమ్ ఆధిక్యత ఆరో రౌండ్ లో 31 వేలకు చేరింది. 8వ రౌండ్‌ ముగిసే సరికి విక్రమ్ రెడ్డి మెజార్టీ 32,892 ఓట్లు కు పెరిగింది. తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సమయానికి విక్రమ్ రెడ్డికి 45924, బీజేపీ అభ్యర్ధికి 8315 ఓట్లు, బీఎస్సీకి 2217 ఓట్లు వచ్చాయి. విక్రమ్ కు 9వ రౌండ్ పూర్తయ్యే సరికి 37609 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.

50 వేలు దాటిన విక్రమ్ మెజార్టీ

50 వేలు దాటిన విక్రమ్ మెజార్టీ


పదో రౌండ్ ముగింపు సమయానికి మెజార్టీ 42,704 కు పెరిగింది. అనూహ్యంగా నోటాకు 2,202 ఓట్లు పోలయ్యాయి. మేకపాటి కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్లు ఈ ఎన్నికల్లో మరోసారి నిరూపితం అయింది. ఆ కుటుంబానికి ఆత్మకూరు ఓటర్లు మద్దతుగా నిలిచారు. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగిన విక్రమ్ రెడ్డికి భారీ మెజార్టీ కట్టబెడుతున్నట్లుగా స్పష్టం అవుతోంది. 12వ రౌండ్ ముగిసే సమయానికి విక్రమ్ రెడ్డి మెజార్టీ 50,654 కు చేరింది. ఇంకా ఎనిమిది రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది. మరో కొద్ది సేపట్లోనే పూర్తి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వస్తున్న మెజార్టీ పైన వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

English summary
In Atmakur by poll counting YSRCP Candidate Mekapati Vikram Reddy govt majority around 50 thousand of votes. BJP candidate lefet from counting centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X