'రానున్నది వైఎస్ఆర్ సి పి ప్రభుత్వమే, బాబు ప్రలోభాలకు ఇక చెక్'
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోభాలు పెట్టి ఎంఏల్ఏలను లాక్కొంటున్నారని, ఈ అన్యాయం ఎక్కువ రోజులు నిలబదదని వైఎస్ఆర్ సి పి అధినేత జగన్ అన్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి టిడిపికి రాజీనామా చేసి
కర్నూల్:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోభాలు పెట్టి ఎంఏల్ఏలను లాక్కుంటున్నారని ఈ అన్యాయం ఎక్కువ రోజులు నిలబడదని ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్షనాయకుడు ,వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ అన్నారు.
చివరకు ధర్మమే గెలుస్తోందని వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకుడు గంగుల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి బుదవారం నాడు హైద్రాబాద్ లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు.

గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ సి పి లో చేరడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. గంగులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అన్ని రకాలుగా ఒకరికొకరు తోడుగా ఉంటామని ఆయన ప్రకటించారు.
రాజకీయాలను ఎంత అన్యాయమైన స్థాయిలోకి తీసుకుపోయారనేది మనం చూస్తున్నామని ఆయన చెప్పారు.ప్రతిపక్షంలో ఉన్నామని అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
మూడేళ్ళు గడిచిపోయింది. ఇంకో ఏడాది గడిస్తే ఎన్నికల సంవత్సరమే. ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వమే అంటూ జగన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రామాయణం, మహభారతం,ఖురాన్, బైబిల్ లలో ఎక్కడైనా సగం వరకు ఆధర్మం, అన్యాయం గెలిచినట్టు కన్పిస్తోంది. కానీ, చివరకు ధర్మం,న్యాయమే గెలుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications