'గోదావరి' కేంద్రంగా జగన్ అనూహ్య నిర్ణయం, మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన తరువాత కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలతో ముందు కు వెళ్తున్నాయి. మాజీ సీఎం జగన్ సైతం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. వరుస ప్రకటనలతో రాజకీయంగా కొత్త చర్చకు కారణం అవుతున్నారు. కొత్త సమీకరణాల వేళ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి జిల్లాల కేంద్రంగా కార్యాచరణ ఖరారు చేసారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది.
మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా జగన్ రూటు మారింది. రెండేళ్ల పాలన పూర్తి కావటంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కీలక అంశాల పైన ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇప్పుడు గోదావరి లో కీలకమైన ఆక్వా రంగం పైన ఫోకస్ చేసారు. ఇప్పటికే గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు జగన్ ను కలిసారు. తమ సమస్యలను ప్రస్తావించారు. వారికి పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తానే గోదావరి జిల్లాల్లో ధర్నా కు వస్తానని అల్టిమేటం జారీ చేసారు. కాగా, సీఎం చంద్రబాబు స్వయంగా ఈ సమస్య పైన రివ్యూ చేసారు. డ్ ధర రూ 4 తగ్గించాలని నిర్దేశించారు. అయితే, రూ 2 మాత్రమే తగ్గించారనే వాదన వినిపిస్తోంది. ప్రతి ఎకరాకు వాగ్దానం చేసిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం అందించడంలో విఫలమైందని, ఒక్క కొత్త సబ్సిడీ విద్యుత్ కనెక్షన్ కూడా జారీ చేయలేదని, దీనివల్ల వేసవి కాలంలో మరింత కష్టాలు ఎదురయ్యాయని వివరిస్తున్నారు.

కార్యాచరణ ఖరారు చేయనున్న జగన్
దీంతో, ఆక్వా రైతులకు మద్దతుగా జగన్ ఈ నెల 15న భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. రైతు సంఘాలతో చర్చలు జరిపి, పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్టీ నేత ప్రసాద రాజు కీలక అంశాలను ప్రస్తావించారు. రైతులకు అండగా నిలవకుండా, ప్రభుత్వం దాణా సిండికేట్లు, ఎగుమతిదారులు, మధ్యవర్తులను కాపాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్ ధరలను ప్రభుత్వం కిలోకు రూ.4 మేర ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత కేవలం రూ.2 మాత్రమే తగ్గించిందని చెప్పుకొచ్చారు.
ప్రతి ఎకరాకు వాగ్దానం చేసిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం అందించడంలో విఫలమైందని, ఒక్క కొత్త సబ్సిడీ విద్యుత్ కనెక్షన్ కూడా జారీ చేయలేదని, దీనివల్ల వేసవి కాలంలో మరింత కష్టాలు ఎదురయ్యా యని ఆయన ఆరోపించారు. పెరుగుతున్న నష్టాల కారణంగా చాలా మంది ఆక్వా రైతులు ఇప్పుడు పంటకు విరామం ఇవ్వాలని ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో.. వారికి మద్దతుగా జగన్ భీమవరం వస్తున్నారని.. వారితో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తారని వెల్లడించారు.













Click it and Unblock the Notifications