స్థానిక ఎన్నికల్లో జగన్ ధీమా వెనుక, వరంగా మారిన ఆ నిర్ణయం - కొత్త లెక్కలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే కూటమి పార్టీలు సమన్వయ కర్తలను జిల్లాల వారీ గా నియమించాయి. మూడు పార్టీలు కలిసి కట్టుగా ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించాయి. ఇటు వైసీపీ సైతం ఎన్నికలకు సై అంటోంది. మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలకు బిగ్ టాస్క్ ఫిక్స్ చేసారు. అయితే.. జగన్ ధీమా వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. రాజకీయంగా చర్చగా మారుతున్నాయి.
ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వినాయక చవితి తరువాత ఏ క్షణమైనా ఎన్నిక ల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ద్వారా తమకు ప్రజల మద్దతు ఎక్కడా తగ్గ లేదని నిరూపించుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎక్కడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినా.. ఆ నియోజక వర్గ ఇంఛార్జ్ కు వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదని జగన్ తేల్చి చెప్పారు. పరిస్థితులు వైసీపీకి అను కూలంగా ఉన్నాయని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే గెలుపు కష్టం కాదని జగన్ చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పూర్తి గా అమలు కాని హామీలు.. ధరల పెరుగుదల.. కూటమిలో సీట్ల కోసం పోటీ తమకు కలిసి వస్తాయని జగన్ అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రత్యక్ష ఎన్నిక విధానం కూడా తమకు కలిసి వస్తుందనేది జగన్ విశ్లేషణ. దీంతో.. ఈ ప్రత్యక్ష ఎన్నిక సద్వినియోగం చేసుకోవటం పైన కీలక సూచనలు చేసారు.

పార్టీ ముఖ్య నేతలకు నిర్దేశం
మున్సిపల్ ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ కోసం ప్రత్యక్ష ఎన్నికలు జరగనుండటంతో.. మేయర్ అభ్యర్దిగా బలమైన వ్యక్తిని ఎంపిక చేస్తే.. సగం గెలుపు సులభం అవుతుందని జగన్ పార్టీ నేతలకు నిర్దేశించారు. ఇందు కోసం గతంలో పని చేసిన వారితో సహా.. స్థానిక సమీకరణాల్లో భాగంగా ప్రజలతో సంబంధం ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక.. పంచాయితీ ఎన్నికల వేళ గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని జగన్ నిర్దేశించారు. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం కూటమికి నష్టం చేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇక.. మూడు పార్టీల్లోనూ స్థానిక ఎన్నికల్లో సీట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉందని... ఒకరికే అవకాశం ఉండటంతో.. మిగిలిన వారిలో కొందరు స్వతంత్రులుగా పోటీ చేసే అవకాశం ఉంటుందని.. అటు వంటి స్థానాల్లో ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే.. స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా ఫలితాలు సహజమనే విషయాన్ని పలువురు గుర్తు చేస్తు న్నారు. ఇటు కూటమి.. అటు వైసీపీ హోరా హోరీగా భావిస్తున్న ఈ ఎన్నికల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
