స్థానిక ఎన్నికల వేళ జగన్ మరో కీలక నిర్ణయం, తేల్చి చెప్పేసారు..!!

సీఎం చంద్రబాబు లక్ష్యంగా మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను డీఎస్సీతో పాటుగా గ్రూప్ -1 పరీక్ష పైన సీబీఐ విచారణకు సవాల్ చేస్తే ఎవరూ ముందుకు రాలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నా చంద్రబాబు స్పందించటం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆరోపించారు. తాము బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని.. స్థానిక ఎన్నికల్లోనూ సముచిత ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ పలు కీలక అంశాల పైన స్పందించారు. బీసీలను చంద్రబాబు నిలువు నా మోసం చేసారని జగన్ ఆరోపించారు. హైకోర్టులో గతంలో తీర్పులు ఉన్నాయని తెలిసి కూడా బీసీలను రాజకీయ ప్రయోజనాలను వాడుకునేందుకు 34 శాతం రిజర్వేషన్లంటూ మరొకసారి మళ్లీ తెరపైకి తెస్తున్నారని చెూప్పుకొచ్చారు. చంద్రబాబు తన మనుషుల చేతనే న్యాయస్థానాల్లో కేసులు వేయిస్తారని జగన్ అన్నారు. బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ అని జగన్ అన్నారు. బీసీలకు న్యాయం చేసేది వైసీపీ నేనని చెప్పారు. బీసీలకు నామినేటెడ్ పదవుల్లోనూ, కాంట్రాక్టు ల్లోనూ యాభై శాతం ఇవ్వాలని చట్టం తెచ్చి మరీ అమలు చేశామని తెలిపారు. చంద్రబాబు తన మనుషులతో కేసులు వేయించి కొట్టివేయించి అది వేరే వాళ్ల మీదకు నెడతారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు నలభై శాతం మంది కి మంత్రి పదవులు ఇచ్చామని జగన్ తెలిపారు. 25 లోక్ సభ సీట్లలో పదకొండు స్థానాలు ఇచ్చామని జగన్ వివరించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేసింది వైసీపీయేనని జగన్ తెలిపారు.

చంద్రబాబు ఆ ఒక్క నిర్ణయానికి జై కొట్టిన జగన్- అక్కడే అసలు లెక్క..!!
చంద్రబాబు ఆ ఒక్క నిర్ణయానికి జై కొట్టిన జగన్- అక్కడే అసలు లెక్క..!!
ysrcp-chief-ys-jagan-slams-chandrababu-over-bc-reservations-highlights-ycp-welfare-measures

స్థానిక ఎన్నికల పై జగన్ గురి

అదే విధంగా బీసీలకు యాభై శాతం చట్టసభల్లో అవకాశం కల్పించాలని పార్లమెంటులో ప్రస్తావించింది తామేనని గుర్తు చేసారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ స్థానాలను బీసీలకు ఇచ్చామని చెప్పారు. బీసీ నేతలపైనే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఏపీలోకరువు విలయం సృష్టిస్తుందని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం స్పందించడం లేదని అన్నారు. 688 మండలాలకు గాను, 628 మండలాల్లో లోటు వర్షపాతం నమోదయిందని అన్నారు. రాయలసీమలోనే కాదు.. కోస్తాంధ్రలోనూ కరువు విలయ తాండవం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. పోలీసుల కార్లలోనే గంజాయి దొరకుతుందని విమర్శించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ 9 వేల కోట్లకు చేరాయని చెప్పుకొచ్చారు. వీటి పైన నిర్ణయం తీసుకోకుంటే మరోసారి పోరాటం తప్పదని జగన్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+