జగన్ సీఎం కాలేడు, వారిద్దరూ దోస్తులే, బాబును అవే రక్షిస్తాయి: జెసి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌ల భేటీపై అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబు-పవన్‌కళ్యాణ్ ఎప్పటినుండో భాయి...భాయి అని వ్యాఖ్యానించా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌ల భేటీపై అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబు-పవన్‌కళ్యాణ్ ఎప్పటినుండో భాయి...భాయి అని వ్యాఖ్యానించారు. 2019లో వైసీపీ చీఫ్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ లేదన్నారు. ఆ అదృష్టం జగన్‌కు లేదన్నారు.
అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి ప్రతి విషయంలో తనదైన శైలిలో స్పందిస్తారు. తాజాగా పవన్‌కళ్యాణ్ బాబుల భేటీపై కూడ ఆయన స్పందించారు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా స్నేహం ఉందన్నారు. అంతేకాదు ఉద్ధానం సమస్యను చంద్రబాబు పరిష్కరించనున్నారని ఆయన చెప్పారు.
తన మాటలతో జెసి దివాకర్‌రెడ్డి మరోసారి వైసీపీ చీఫ్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు రాష్ట్రాభివృద్ది కోసం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు.

వారిద్దరూ దోస్తులే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌లు భాయి..భాయి అని చెప్పారు. 2014 నుండి వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించాలని జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ పోరాటం చశారని ఆయన చెప్పారు. అయితే ఈ
సమస్యను పరిష్కరించుకొనేందుకు గాను చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
Recommended Video


2019లో జగన్ సిఎం కాలేడు
2019 లో వైసీపీ చీఫ్ జగన్ సీఎం అయ్యే ఛాన్స్ అయ్యే ప్రసక్తే లేదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే చంద్రబాబును గట్టెక్కిస్తాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిధులు లేకున్నా రాష్ట్రాన్ని అభివృద్దికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జగన్‌కు 2019లో ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం లేదన్నారు దివాకర్‌రెడ్డి.

నంద్యాలలో టిడిపి గెలుపు ఖాయం
నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి గెలుపు ఖాయమన్నారు.చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ది గెలిపిస్తోందని జెసి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత సహజమన్నారు. అయితే దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. వ్యతిరేకత ఉన్నంత మాత్రాన ఈ ఎన్నికల్లో ఓటమిపాలు అవుతారనే విషయం సరికాదన్నారు.

వెంకయ్య వద్దకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది
ఏపీ రాష్ట్రాభివృద్దికి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని చెప్పారు. అయితే ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నికైతే గతంలో మాదిరిగా ఆయన వద్దకు వెళ్ళే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం ఆయన ఎప్పటిమాదిరిగానే కృషి చేస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications