Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Times Now Survey- ఏపీలో అధికారంపై క్లారిటీ: అంచనాలకు భిన్నంగా: సీఎంగా ఆయన వైపే మొగ్గు..!!

అమరావతి: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. జమిలి ఎన్నికలకు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటోందా?.. ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జమిలికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ప్రశ్నలకు దాదాపుగా అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే.. అనే కాన్సెప్ట్‌తో ఈ మధ్యకాలంలో జాతీయ మీడియాలో వరుస సర్వేలు వెల్లువెత్తడానికి అదే ప్రధాన కారణమనీ చెబుతున్నారు.

ఇదివరకు రెండు టీవీల్లో..

ఇదివరకు రెండు టీవీల్లో..

ఇదివరకు రెండు జాతీయ మీడియా ఛానళ్లు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలు చేపట్టాయి. ఈ రెండు కూడా కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టం చేశాయి. ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమౌతుందని తేలింది. ఇప్ప్పుడున్న లోక్‌సభ స్థానాల కంటే కూడా అధిక సీట్లను ఎన్డీఏ కూటమి తన ఖాతాలో వేసుకోగలుగుతుందని స్పష్టమైంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని అంచనా వేసింది.

ఇండియా టుడే కూడా..

ఇండియా టుడే కూడా..

ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే కూడా ఇదే స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో మరోసారి ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యాన్ని కోరుకుంటోన్నారని తేలింది. సీట్లు మాత్రం గతం కంటే తగ్గినప్పటికీ.. ఆయన మూడోసారి ప్రధానిగా పగ్గాలు అందుకుంటారని స్పష్టమైంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని, 25 లోక్‌సభ స్థానాలకు 18 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని పేర్కొంది ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే.

ఇప్పుడిక టైమ్స్ నౌ వంతు..

ఇప్పుడిక మరో జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ వంతు వచ్చింది. తాజాగా స్నాప్ ఒపీనియన్ పోల్ పేరుతో టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో దాదాపుగా అవే ఫలితాలను ప్రతిబింబించింది. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. భారతీయ జనతా పార్టీకి సొంతంగా 292 నుంచి 312 లోక్‌సభ స్థానాలు లభిస్తాయని పేర్కొంది. కాంగ్రెస్ ఈ దఫా కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని, 118 నుంచి 138 స్థానాలకే పరిమితమౌతుందని వివరించింది.

ఏపీలో జగన్ హవా..

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని తేల్చింది టైమ్స్ నౌ స్నాప్ ఒపీనియన్ పోల్. ఇప్పుడున్న లోక్‌సభ స్థానాలతో పోల్చుకుంటే వాటి సంఖ్య తగ్గినప్పటికీ.. మెజారిటీ సీట్లు వైఎస్ఆర్సీపీకే వెళ్తాయని పేర్కొంది. మొత్తం 17 నుంచి 23 లోక్‌సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. ఇదే రేషియోను అసెంబ్లీ స్థానాలకు బదలాయించుకుంటే.. వైసీపీ సులువుగా 125 నుంచి 135 అసెంబ్లీ సీట్లల్లో జెండా ఎగురవేయడం ఖాయం.

వైసీపీ రియాక్షన్ ఇదీ..

వైసీపీ రియాక్షన్ ఇదీ..


ఈ స్నాప్ ఒపీనియన్ పోల్‌పై వైఎస్ఆర్సీపీ స్పందించింది. వరుస సర్వేల్లో తమ ప్రభుత్వం దూసుకెళ్తోందని పేర్కొంది. చెక్కు చెదరని ప్రజాదరణను వైఎస్ జగన్ సొంతం చేసుకుంటోన్నారని ప్రశంసించింది. ఆగస్టు 15వ తేదీన టైమ్స్ నౌ నిర్వహించిన సర్వే ప్రకారం.. తమ పార్టీకి 17 నుంచి 23 ఎంపీ సీట్లు లభిస్తాయని తేలినట్లు తెలిపింది. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జ‌గ‌న్‌ 5వ స్థానంలో ఉన్నారని పేర్కొంది. ఈ సర్వేలన్నీ- ఇదివరకు టీడీపీ చేసిన సర్వే ప్రచారానికి, ఆ నాయకుల అంచనాలకు భిన్నంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రుల పనితీరులో వైఎస్ జగన్ 20వ స్థానంలో నిలిచారంటూ ఇదివరకు టీడీపీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+