వైసీపీకి షాక్: టిడిపిలోకి నర్లు నరేంద్ర, డిసెంబర్ 30న, చేరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 30వ, తేదిన చంద్రబాబునాయుడు సమక్షంలో వీరు టిడిపిలో చేరనున్నారు.ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పార్టీ ముఖ్యులతో వీరు చర్చించారు.

ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత నర్తు నరేంద్ర టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.పలాస నియోజకవర్గానికి చెందిన వంకా నాగేశ్వర్‌రావు కూడ టిడిపిలో చేరనున్నారు. పాతపట్నానికి చెందిన పాలవలస కరుణాకర్ కూడ టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఇచ్చాపురం ఎమ్మెల్యే ఆశోక్, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషతో ఈ ముగ్గురు నేతలు పార్టీలో చేరే విషయమై చర్చించారు.

ysrcp, congress leaders may to join in TDP on Dec 30

ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన నర్తు నరేంద్ర 2014లో వైసీపీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే టిక్కెట్టు దక్కకపోవడంతో అప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

పలాస నియోజకవర్గానికి చెందిన వంకా నాగేశ్వర్ రావు 2009లో పిఆర్పీ నుండి పోటీ చేశారు. 2014లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా, 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన పాలవలస కరుణాకర్ ఓటమి పాలయ్యారు.ఈ ముగ్గురు కూడ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో చేరనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress, Ysrcp key leaders from Srikakulam district will join in Tdp on Dec 30. Ysrcp leader Narendra, congress leaders Nageshwar rao,and karunakar will join in Tdp

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి