పీకే అంచనాలు నిజమయ్యేనా - ట్రాక్ రికార్డు ఏం చెబుతోంది..!!
ప్రశాంత్ కిశోర్(పీకే) సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. జగన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని విశ్లేషించారు. ఉచితాలపైన జగన్ ఆధాపడటంతో ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమితో పోల్యారు. ఇక్కడే అసలు పీకే విశ్లేషణతో పలువురు విభేదిస్తున్నారు. ఏపీలో గ్రౌండ్ రియాల్టీ గురించి వివరిస్తున్నారు. దీంతో పాటుగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పీకే అంచనాలు...వాస్తవాలు ఇప్పుడు చర్చలోకి వచ్చాయి.
పీకే సంచలనం: ప్రశాంత్ కిశోర్ 2019 ఎన్నికల్లో జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తరువాత తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయనని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. బీహార్ లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర నిర్వహించారు. కానీ, ఆశించిన స్థాయిలో అక్కడ పీకేకు మద్దతు రాలేదు.

ఇతర రాష్ట్రాల్లో పార్టీలను గెలిపించిన పీకే సొంత రాష్ట్రంలో సొంత పార్టీకి గుర్తింపు తెచ్చుకోవటంలో విఫలమయ్యారు. తెలంగాణలో కొద్ది రోజులు కేసీఆర్ కు అనుకూలంగా పని చేసారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు, సలహాల కోసం టీడీపీ ప్రయత్నాలు చేసింది. చంద్రబాబు, తనకు ఒక కామన్ ఫ్రెండ్ ఒత్తిడి మేరకు తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందని గతంలో పీకే చెప్పుకొచ్చారు.
వైసీపీ వాదన ఇలా: కొద్ది రోజుల క్రితం ఉండవల్లిలో..తాజాగా హైదరాబాద్ లో చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ సమావేశాలు నిర్వహించారు. అభ్యర్దులు, ప్రచారం, వ్యూహాల పై సూచనలు చేసినట్లు సమాచారం. ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని.. ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదేచేసి దెబ్బతిన్నారని తెలిపారు. ఇక్కడే పీకే వ్యాఖ్యలతో వైసీపీ విభేదిస్తోంది.
తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధికి మద్దతుగానే హైదరాబాద్ తో సహా గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉన్నా మార్చకపోవటం ఒక కారణంగా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు, హామీలు ఆ పార్టీకి మెజార్టీ రావటానికి కారణాలనే విశ్లేషణలు ఉన్నాయి.
గతంలో తప్పిన అంచనాలు: దీంతో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ పథకాలను అమలు చేసి ఓట్లు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. కానీ, గెలవలేదు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లో బీజేపీకి వ్యతిరేకంగా అంచనాలు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే గెలిచింది. 2019 ఎన్నికల సమయంలో ఆంధ్ర ఆక్టోపస్ గా పిలుచుకొనే లగడపాటి రాజగోపాల్ టీడీపీ గెలుస్తుందని ధీమాగా చెప్పారు.
ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఆ తరువాత రాజగోపాల్ పూర్తిగా ఎన్నికల సర్వేలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్న పీకే, ప్రస్తుతం బీజేపీ తో పొత్తు పైన వస్తున్న వ్యతిరేక ప్రచారం దారి మళ్లించటానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేసి మైండ్ గేమ్ ఆడుతున్నారనేది వైసీపీ నేతల వాదన. మరి..పీకే జోస్యం నిజమవుతుందా.. వైసీపీ ధీమా గెలుస్తుందా అనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేయనున్నాయి.
-
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications