'అనూహ్యంగా' పవన్ కళ్యాణ్‌కు జగన్ చెక్, బాబుకు నో 'ఛాన్స్'?
అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే అప్రమత్తమయ్యారా? సోమవారం పార్టీ నేతలతో భేటీ ద్వారా అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కళ్యాణ్‌కు చెక్ చెప్పే ప్రయత్నాలు జగన్ చేశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
Recommended Video

చదవండి: మీకు మాకు కాదు: బీజేపీతో కొట్లాటపై టీడీపీ ట్విస్ట్, మోడీపై యుద్ధమే: గల్లా జయదేవ్ ఘాటుగా
బీజేపీతో పొత్తు నేపథ్యంలో గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని, హోదాతో లాభం లేదని పలుమార్లు చెప్పారు. కానీ ఇప్పుడు ప్యాకేజీ లేదు, హోదా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ప్రత్యేక హోదా కోసం పవన్ కీలక అడుగులు వేస్తున్నారు.
చదవండి: ఢిల్లీలో వైసీపీ కార్నర్, అందుక జగన్ భేటీ!: బాబు చెప్పారు కానీ.. బీజేపీపై ధర్మాన ఆగ్రహం
చదవండి: హోదా కోసం వైసీపీ కొత్త నినాదం, ఢిల్లీలో ధర్నా: పార్టీ నేతలపై జగన్ తీవ్ర అసంతృప్తి

ప్రత్యేక హోదానే జగన్ నినాదం
ప్రత్యేక ప్యాకేజీ నుంచి ప్రత్యేక హోదాకు టీడీపీ మరలుతున్న సమయంలో, మరోవైపు హోదా కోసం పవన్ కళ్యాణ్ ఉద్యమించేందుకు ఉద్యుక్తులవుతున్న తరుణంలో జగన్ సోమవారం రాత్రి పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ప్రత్యేక హోదానే నినాదమని నొక్కి వక్కాణించారు.

లెక్క తెల్చే పనిలో పవన్, అనూహ్య నిర్ణయానికి ముందే
ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిధుల లెక్క తేల్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాంతో పాటు హోదా కోసం ఆయన ఉద్యమించనున్నారు. బడ్జెట్‌లో అన్యాయం జరిగినందున ప్రత్యేక హోదా కోసం ఆయన ఢిల్లీలో ప్రధాని మోడీని కలవడం, సానుకూల స్పందన రాకుంటే దీక్ష వంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ సాగింది.

తెరపైకి మళ్లీ హోదా
మరోవైపు, హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని చెప్పిన టీడీపీ.. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తాము మళ్లీ హోదా డిమాండ్ చేస్తామని చెబుతోంది. అయితే టీడీపీ ప్రత్యేక హోదా నినాదం పూర్తిగా ఎత్తుకోకముందే వైసీపీ అప్రమత్తమయింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోకుండా టీడీపీ ఆ నినాదం ఎత్తుకునే అవకాశాలు తక్కువ.

అటు బాబుకు, ఇటు పవన్‌కు
దీక్ష వంటి అనూహ్య నిర్ణయాలు పవన్ కళ్యాణ్ తీసుకోకముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించాలని తాజా భేటీలో నిర్ణయించింది. హోదాపై టీడీపీ పూర్తిస్థాయిలో గళమెత్తకముందు, పవన్ దీక్ష విషయమై తేలకముందే వీరిద్దరికి కౌంటర్ ఇచ్చేలా జగన్ వ్యూహరచన చేశారని అంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ సూచననా
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైగా మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలు ఆచితూచి అడుగు వేయాలి. ఇన్నాళ్లు వైసీపీలో అనుభవలేమి కనిపించిందనే విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం అటు హోదాపై చంద్రబాబుకు, ఇటు ఆందోళనలపై పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్టేలా వ్యవహరించారని, ఇది ప్రశాంత్ కిషోర్ సూచనే అని అంటున్నారు. మరోవైపు, ఢిల్లీలో ఇటీవల టీడీపీ ఆందోళనల కారణంగా వైసీపీ కార్నర్ అయింది. దానిని కూడా పూడ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications