వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా కోసం వైసీపీ కొత్త నినాదం, ఢిల్లీలో ధర్నా: పార్టీ నేతలపై జగన్ తీవ్ర అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ సోమవారం సాయంత్రం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ, ఆ పార్టీ ఎంపీలది డ్రామా అని మండిపడ్డారు.

బడ్జెట్‌పై సొంత నేతలకు అశోక్ ఝలక్: వాళ్లు కూడానా.. పవన్ కళ్యాణ్‌పై కేఈ తీవ్రవ్యాఖ్యలుబడ్జెట్‌పై సొంత నేతలకు అశోక్ ఝలక్: వాళ్లు కూడానా.. పవన్ కళ్యాణ్‌పై కేఈ తీవ్రవ్యాఖ్యలు

ప్రత్యేక హోదా మన హక్కు అని, ప్యాకేజీ వద్దు అనేదే తమ నినాదం అని చెప్పారు. హోదా ఒక్కటే ఏపీకి సంజీవిని అన్నారు. హోదా కోసం మార్చి 1న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు.

ఢిల్లీలో వైసీపీ కార్నర్, అందుక జగన్ భేటీ!: బాబు చెప్పారు కానీ.. బీజేపీపై ధర్మాన ఆగ్రహంఢిల్లీలో వైసీపీ కార్నర్, అందుక జగన్ భేటీ!: బాబు చెప్పారు కానీ.. బీజేపీపై ధర్మాన ఆగ్రహం

ప్రత్యేక హోదాకు బాబు ప్రభుత్వం సమాధి

ప్రత్యేక హోదాకు బాబు ప్రభుత్వం సమాధి

ప్రత్యేక హోదాకు చంద్రబాబు ప్రభుత్వం సమాధి కట్టిందని భూమన మండిపడ్డారు. హోదాతో సమానమని టీడీపీ కల్లిబొల్లి కబుర్లు చెబుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆశయాలను హోదా మాత్రమే నెరవేరుస్తోందని చెప్పారు.

మార్చి 3న జగన్ పాదయాత్రలో, 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా

మార్చి 3న జగన్ పాదయాత్రలో, 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా

మార్చి 3న నేతలు అందరూ జగన్ పాదయాత్రలో పాల్గొంటారని భూమన చెప్పారు. పార్టీ అధినేత జెండా ఊపి ఆందోళనలను ప్రారంభిస్తారని చెప్పారు. మార్చి 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వదద్ద ధర్నా చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో హోదా ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

రాజీనామాలపై భూమన ఇలా

రాజీనామాలపై భూమన ఇలా

ప్రత్యేక హోదా విషయమై తమ ఎంపీలు అవసరమైతే రాజీనామాలు చేస్తారని గతంలో తాము చెప్పామని, దానికి తాము కట్టుబడి ఉన్నామని భూమన చెప్పారు. ఈ విషయంలో తగ్గే ప్రసక్తి లేదన్నారు. అయితే ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంటులో ప్రశ్నించే వారు ఉండరని ట్విస్ట్ ఇచ్చారు. హోదా కోసం జగన్ అనేకసార్లు దీక్షలు, ధర్నాలు చేశారని చెప్పారు.

 పనితీరుపై జగన్ అసంతృప్తి

పనితీరుపై జగన్ అసంతృప్తి

కాగా, పార్టీ నేతలతో జరిగిన భేటీలో జగన్ క్షేత్రస్థాయిలో పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో నేతలు సంతృప్తికరంగా ముందుకు సాగడం లేదని, అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవడం లేదని చెప్పారు. ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయా నియోజకవర్గ స్థాయి నేతలకు చేరవేయాలని సూచించారని తెలుస్తోంది.

English summary
YSR Congress Party ready to dharna at Jantar Mantar on March 5th for Specia Status. YSRCP MPS ready to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X