ఎన్టీఆర్‌ను కలిసిన విడదల రజిని..?

ఏపీ రాజకీయ వర్గాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని , జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ ప్రైవేట్ ఫంక్షన్‌లో వీరిద్దరు కలుసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ఎదురుకాగానే విడదల రజిని లేచి ఆయనకు నమస్కరించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ సైతం విడదల రజినికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మాజీ మంత్రి విడదల రజిని ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు. ఆ గౌరవంతోనే ఎన్టీఆర్‌కు విడదల రజిని అభివాదం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే విడదల రజిని గతంలో టీడీపీలో పని చేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలో విడదల రజిని టీడీపీలో కొనసాగారు. టీడీపీలో టికెట్ దక్కక పోవడంతో వైసీపీలో చేరి , 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు.తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికి ఆమెకు జగన్ మంత్రివర్గంలో చోటు లభించింది.

ysrcp ex minister vidadala rajini meets jr ntr

వైద్య , ఆరోగ్యశాఖ మంత్రిగా ఆమె పని చేశారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన విడదల రజిని, 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి విడదల రజిని పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆమె వైసీపీని వీడి బీజేపీలో చేరతారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే పార్టీ మార్పుపై విడదల రజిని ఇప్పుటి వరకు రియాక్ట్ కాలేదు. ఇటువంటి సమయంలో ఎన్టీఆర్‌, విడదల రజిని ఓకే ఫంక్షన్‌లో దర్శనమివ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+