ఏపీలో పథకాల లబ్దిదారులకు గుడ్ న్యూస్ - నిధుల విడుదల మొదలు..!
ఏపీలో ఎన్నికల సందర్భంగా సంక్షేమ పథకాల నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో భారీ ఎత్తున పథకాల నిధుల విడుదలకు ఈసీ నో చెప్పింది. ఇప్పుడు ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆయా పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. ఈసీ నుంచి ఇప్పటికే అనుమతి రావడంతో తొలుత కొన్ని పథకాలకు నిధుల్ని విడుదల చేస్తున్నారు. దీంతో ఆయా పథకాల లబ్దిదారుల ఖాతాల్లో ఇవాళ్టి నుంచి నిధులు పడనున్నాయి..

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు ఇస్తున్న నిధులు విడుదల కాలేదు. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్ అదేశాల మేరకు పథకాలకు నిధుల విడుదల ప్రారంభించారు. ముందుగా ఆసరాకు రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కు రూ.502 కోట్లు విడుదల చేశారు. మిగిలిన పథకాలకూ వరుసగా నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కు ముందు డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఆ తర్వాత నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు నిధుల విడుదల ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. రాజకీయ కారణాలతో ఆగిన రూ.14 వేల కోట్ల నిధులు ఇప్పటికైనా విడుదల కానుండటంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications