కేంద్రం పెట్రో ధరల తగ్గింపు స్వాగతించిన ఏపీ-రాష్ట్రంలో ఎప్పుడో చెప్పిన ధర్మాన
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా పెట్రోల్, డీజిల్ సహా చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రోల్ పై లీటరుకు రూ.5, డీజిల్ పై లీటరుకు రూ.10 రూపాయల ధర తగ్గింది. అదే సమయంలో కేంద్రం సూచన మేరకు బీజేపీ పాలిత రాష్టాలు కూడా ఇప్పటికే భారీగా వ్యాట్ తగ్గింపులు ప్రకటిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వినియోగదారులకు ఊరట దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ సర్కార్ మాత్రం వ్యాట్ తగ్గించే విషయంలో మౌనం వహిస్తోంది.
ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అదే సమయంలో కేంద్రం సూచనపై వ్యాట్ తగ్గించే విషయంలో వైసీపీ సర్కార్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో కూడా ఆయన చెప్పేశారు. వ్యాట్ తగ్గింపుపై వైసీపీ సర్కార్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీంతో ఇప్పట్లో వ్యాట్ తగ్గింపు లేనట్లేనని తేలిపోయింది.

మరోవైపు కేంద్రం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించకుండా మౌనం వహించడంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేంద్రం నిర్ణయం తర్వాత ప్రస్తుతం దక్షిణాదిలో ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గించాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేపీ నిరసనలు చేపడుతోంది. మరో విపక్షం టీడీపీ కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడుతోంది. అయితే వెంటనే వ్యాట్ తగ్గిస్తే భారీగా ఆదాయం కోల్పోతామన్న భయం వైసీపీ సర్కార్ లో కనిపిస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications