వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయటం లేదు - వైసీపీ ఎమ్మెల్యే ప్రకటన..!!
వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కీలక ప్రకటన చేసారు. వైసీపీలో వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్ల వ్యవహారం పైన చర్చ సాగుతోంది. దీని పైన తాజా - మాజీ మంత్రులకు సీఎం జగన్ నో చెప్పారు. కానీ, చాలా మంది నేతలు తమ వారసులను బరిలోకి దించేందుకు సిద్దమయ్యారు. అందులో ఎంత మందికి సీఎం జగన్ అవకాశం ఇస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. మరో వైపు సీఎం జగన్ సమీక్షలు చేసిన చోట అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఈ సమయంలో కీలక నియోకజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని ప్రకటించారు.

కుమార్తెనే అభ్యర్ధిగా ప్రకటన
ఎమ్మెల్యే ముస్తఫా తన కుమార్తే వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా ప్రకటించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో ముస్తఫా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫాకు 2019 ఎన్నికల్లో 77,047 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన మహ్మద్ నజీర్ కు 54, 956 ఓట్లు వచ్చాయి. ఇక, రెండో సారి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా యాక్టివ్ అయ్యారు. తండ్రితో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు వచ్చిన సమయంలోనూ ముస్తఫా తన కుమార్తెను పరిచయం చేసారు.

సీఎం జగన్ అనుమతి ఇచ్చారా
కొంత కాలంగా వచ్చే ఎన్నికల్లో మస్తఫా కుమార్తే వైసీపీ అభ్యర్ధిగా బరిలో నిలుస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, వారసుల విషయంలో సీఎం జగన్ క్లారిటీ ఇవ్వకపోవటంతో ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ముస్తఫా ఆకస్మికంగా వచ్చే ఎన్నికల్లో తన కుమార్తే గుంటూరు తూర్పు వైసీపీ అభ్యర్ధి అని మీడియా సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి పరిధిలోని జిల్లాల్లో ప్రతీ సీటు వైసీపీకి కీలకంగా మారుతోంది. మైనార్టీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తిరిగి ముస్లిం మైనార్టీకే సీటు కేటాయించటం ఖాయం.

వారసులకు సీట్లపై మరోసారి చర్చ
అయితే, 2024 ఎన్నికలు అటు టీడీపీ - ఇటు వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అందునా ఇప్పుడు వైసీపీలో వారసుల కోసం అనేక మంది సీనియర్లు సీఎం జగన్ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకున్న ఒక పాలసీగా అమలు చేయాల్సి ఉంటుందని గతంలోనే సీఎం జగన్ స్పష్టం చేసారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఏకంగా వచ్చే ఎన్నికల్లో తన కుమార్తే పోటీ చేస్తారని ప్రకటించటంతో..దీని పైన వైసీపీ అధినాయకత్వం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications