పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి - వైసీపీ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం హోరా హోరీ గా మారుతున్న వేళ.. అమరావతి కేంద్రంగా అనూహ్య నిర్ణయానికి రంగం సిద్దం అయింది. ఇందు కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీకి జగన్ తో సహా వైసీపీ దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే.. ఈ సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కూటమికి మరో అస్త్రంగా మారనుంది. జగన్ సెల్ఫ్ గోల్ గా విశ్లేషణలు మొదలయ్యాయి.
అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ అధికారికంగా రాజముద్ర వేయనుంది. ఇందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కేబినెట్ లో తీర్మానం చేసిన ప్రభుత్వం.. అసెంబ్లీ ప్రత్యేక భేటీ లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. వచ్చే వారం కేంద్రం ఈ తీర్మానంకు అనుగుణం గా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టి.. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించనుంది. కాగా, అమరావతి పైన జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి జగన్ హాజరు కావటం లేదని తెలుస్తోంది. ఈ అంశం పైన ఇప్పటికే పార్టీ నేత సజ్జల స్పందించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే.. అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. జగన్ హయాంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన కు 2024 ఎన్నికల్లో ఆమోదం లభించలేదు. దీంతో.. ఎన్నికల్లో ఓటమి తరువాత అమరావతిలో జరిగే అవినీతి గురించి పలు సందర్భాల్లో ప్రశ్నించిన జగన్.. మూడు రాజధానుల అంశాన్ని మాత్రం ప్రస్తావన చేయలేదు.

అమరావతి పై జగన్ వైఖరి ఏంటి
గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పైన నిర్మాణాలు చేస్తే ఖర్చు తగ్గుతుందని.. అవసర మైతే మచిలీపట్నం వరకు వినియోగించుకోవాలని సూచన చేసారు. ఇప్పుడు ప్రభుత్వం నాడు మూడు రాజధానులు అంటూ అమరావతి విషయంలో జగన్ నిర్లక్ష్యాన్ని ఈ సమావేశ వేదికగా వివరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. తాజాగా సజ్జల తమ మూడు రాజధానుల ప్రతిపాదన 2024 ఎన్నికలకు ముందు విషయం అని చెప్పటం ద్వారా.. తాము ఇక ఆ అంశం వదిలేసామనే సంకేతాలు ఇచ్చారు. అదే విషయం జగన్ అసెంబ్లీకి హాజరై అమరావతి విషయంలో తమ ఆలోచన.. అక్కడి రైతుల కోసం తమ డిమాండ్లు సభ ద్వారా వివరిస్తే.. కూటమికి అమరావతి విషయం లో ఇక జగన్ పైన విమర్శలకు అవకాశం ఉండదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేక పెరుగుతోందని.. తమదే అధికారం అని పదే పదే చెబుతున్న జగన్.. కీలకమైన రాజధాని విషయంలో సభకు హాజరు కాకపోవటం అధికర కూటమికి అస్త్రం అందించి నట్లుగానే చర్చ జరుగుతోంది. అమరావతి టెండర్లలో జరిగే అక్రమాలు..అవినీతిపై ప్రతిపక్ష పార్టీ గా వైసీపీ లేవనెత్తే అవకాశం ఉంటుంది. కాగా.. జగన్ పూర్తిగా సభకే దూరం కావటం.. సజ్జలతో ప్రకటన చేయించటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications