వైసీపీ ఆమరణదీక్ష: క్షీణించిన వైవీ ఆరోగ్యం, ఆసుపత్రికి తరలింపు

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణదీక్ష కొనసాగుతోంది. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎంపీలు దీక్ష చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రధానంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం ఉదయాన్నే సుబ్బారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన డీహైడ్రేషన్ కు గురైనట్టు తెలిపారు.

YSRCP Hunger Strike: YV Subba Reddy’s Health Deteriorating

ఆరోగ్యం క్షీణిస్తున్నందునా చికిత్సకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వైవీ సుబ్బారెడ్డి దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో బలవంతంగా ఆయన్ను ఆసుపత్రికి తరలించారు వైద్యులు.

కాగా, అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురైన ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి(73), వరప్రసాదరావు(64)లను బలవంతంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీ భవన్‌లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు దీక్ష కొనసాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+