వైసీపీ ఎమ్మెల్యేకు సొంతపార్టీ నేతల నిరసన సెగ: అసహనంతో షాకింగ్ పని చేసిన ఎమ్మెల్యే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఒకవైపు, వైసీపీలో సొంత పార్టీలోనే చోటుచేసుకుంటున్న అంతర్గత విభేదాలు ఒకవైపు రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నాయి. తాజాగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు నిరసన సెగ తగిలింది.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకట రమణ మూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న పూడిమడకకు వెళ్లగా సొంత వైసీపీ శ్రేణుల నుండి ఆయన నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు కు, వైసిపి లోకల్ లీడర్స్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది.

ysrcp-logo

ఈ క్రమంలో పూడిమడక జెట్టి నిర్మాణం కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు. గతంలోనూ ఆయన అనేక పర్యటనను అడ్డుకున్నారు. అంతేకాదు కన్నబాబు ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కూడా వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .కన్నబాబు వద్దు జగనన్న ముద్దు అంటూ నినాదాలు కూడా చేశారు.

ఇక కన్నబాబు చేస్తున్న అరాచకాలు సీఎం జగన్ దాకా వెళ్లాలని, కన్నబాబు అరాచకాలు నశించాలి అని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కన్నబాబు సొంత పార్టీ నాయకులు అందరు ముందు తనను ప్రశ్నించడంతో సహనం కోల్పోయాడు. నన్నే నిలదీస్తారా ..అంటూ ఒక వ్యక్తి పైన చేయి చేసుకున్నాడు. ప్రశ్నించిన వ్యక్తి చెంపపై కన్నబాబు కొట్టడంతో స్థానికంగా పెద్ద గొడవ చోటుచేసుకుంది.

kannababurajuv

వైసీపీ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా స్థానిక వైసిపి నాయకులు నినాదాలు చేసి ఆందోళనకు దిగారు. కన్నబాబు వర్గానికి స్థానిక వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమస్యల గురించి ప్రశ్నిస్తే సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేను అందరిముందే కొట్టడం ఏమిటని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఎమ్మెల్యే కన్నబాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+