జగన్ బిగ్ స్టెప్- అస్సలు ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు..!!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకర్‌ను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తోంది.
ఈ క్రమంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి కోటి సంతకాల సేకరణ ఆరంభం కానుంది. 45 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నేడు పోస్టర్ల ఆవిష్కరణతో పాటు రచ్చబండ కార్యక్రమం ప్రారంభమౌతుందని అన్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి వినతిపత్రాలు ఇస్ామని వివరించారు.
నవంబర్ 25న వైఎస్ జగన్ గవర్నర్ ను కలిసి కోటి సంతకాలను అందజేస్తారని సజ్జల తెలిపారు. మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వందేళ్లలో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, తమ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వాటిల్లో అయిదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని, మరో మూడింటి నిర్మాణం తుదిదశకు చేరుకుందని చెప్పారు.
మెడికల కాలేజీల పై చంద్రబాబు కుట్రలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను తాము తీసుకున్నామని సజ్జల పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జగన్ నర్సీపట్నంలో పర్యటించారని వ్యాఖ్యానించారు. దేశంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల కొరత ఉందని, తమ ప్రభుత్వ హయాంలో దీన్ని తీర్చడానికి ప్రయత్నం చేశామని చెప్పారు. పేదల కల నిజమవుతున్న సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోన్నారని, దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications