వైకుంఠపాళి మీదే..! కేతిగాళ్లతో స్కిట్స్..మహానాడు డైలాగ్స్ కు అంబటి మార్క్ పంచ్ లు..!
టీడీపీ కడపలో తాజాగా నిర్వహించిన మహానాడులో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ నేతలు భారీ డైలాగ్ లు కొట్టారు. సీఎం చంద్రబాబు సమక్షంలో చేసిన ప్రసంగాల్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు తనదైన శైలిలో పంచ్ లు వేశారు. ఆత్మస్తుతి-పరనిందకే మహానాడు పరిమితమయ్యిందని ఆయన విమర్శించారు. అధికారంలో కొనసాగడంపై అడుగడుగునా అభద్రతాభావం కనిపిస్తోందన్నారు.
ప్రజలను మోసం చేసిన తెచ్చుకున్న అధికారం ఎంతకాలం కొనసాగుతుందోననే అభద్రతాభావంను చంద్రబాబు, లోకేష్‌లు మహానాడులో అడుగుడునా వ్యక్తం చేశారని అంబటి ఆరోపించారు. ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేని అసమర్థ కూటమి పాలనకు ప్రజలు ఇచ్చినవి సున్నా మార్కులే అన్నారు. ప్రజలకు తాము చేసిన వంచనను దాచేయడానికి, తన పార్టీలో ఉన్న కొంతమంది కేతిగాళ్లతో, హాస్యగాళ్లతో కామెడీ డైలాగులు చెప్పించి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యారు.

రాయలసీమలోని వైయస్ఆర్‌సీపీకి బలమైన ప్రాంతమైన కడపలో వ్యూహాత్మకంగా టీడీపీ మహానాడును నిర్వహించి వైయస్ఆర్‌సీపీని దెబ్బతీస్తున్నామని నిరూపించుకునేందుకు తంటాలు పడ్డారని అంబటి విమర్శించారు. అధికారంలో ఉన్న రాజకీయపార్టీగా చాలా ఖర్చు పెట్టి ఆర్భాటంగా మహానాడును నిర్వహించారన్నారు. బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు, అణువణువునా రాజకీయ అభద్రత మొత్తంగా ఈ మూడు రోజుల మహానాడులో కనిపించనవి ఇవేనన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా మొత్తంగా 143 హామీల్లో కనీసం మూడింటి గురించి కూడా తాము నెరవేర్చామని చెప్పుకోలేకపోయారన్నారు
మాట తప్పకుండా 99 శాతం నిలబెట్టుకున్న ఘనత వైయస్ జగన్‌ది అని, మరి ఆయన ధీరుడా... ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ధీరుడా అని అంబటి ప్రశ్నించారు. ఎవరిది హీరోయిజం అని అడిగారు. కడపలో ఒక మీటింగ్, ఒక మహానాడు పెట్టుగానే హీరో అయిపోయాయని చంద్రబాబు భ్రమపడుతున్నారని, ఈ ఏడాది పాలనలో కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ చంద్రబాబుకు సున్నా మార్కులే వచ్చాయన్నారు. మరి ఏరకంగా హీరో అవుతారని ప్రశ్నించారు.
రాజకీయాల్లో వైకుంఠపాళి వద్దు అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని అంబటి తెలిపారు. వైకుంఠపాళి రాజకీయాలు చంద్రబాబువే అన్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని, తరువాత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఒకేసారి నిచ్చెన ఎక్కి ప్రజా మద్దతు లేకపోయినా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబసభ్యులను పూర్తిగా పక్కకుపెట్టేశారన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, వారిని నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచారన్నారు. ఏరోజూ సింగిల్ గా ఎన్నికల్లో గెలవలేదని, ఇప్పుడు కూడా రెండు పార్టీలను కలుపుకుంటేగాని గెలవకలేకపోయాన్నారు. వైకుంఠపాళి రాజకీయాలంటే చంద్రబాబువి తప్ప మరెవ్వరికీ కావన్నారు. చంద్రబాబులా తాము వైకుంఠపాళి రాజకీయాలు నడపలేదన్నారు.
తమ 93 శాతం స్ట్రైక్ రేట్ అని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, ముగ్గురు కలిస్తే వచ్చిన స్కోరు అది అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ టీంలు కలిసి ఆడితే వచ్చిన స్కోర్ అది అని గుర్తుచేశారు. ఒక్కసారి చంద్రబాబు మాత్రమే బ్యాటింగ్ చేసి చూస్తే, క్లీన్ బౌల్డ్ అవుతాడో, డకౌట్ అవుతాడో తెలుస్తుందన్నారు. ఏడాది చంద్రబాబు ఇన్సింగ్స్‌లో ఇప్పటికీ స్కోరు సున్నాయే అన్నారు. వచ్చే నాలుగేళ్లూ అంతేనన్నారు. ఇక తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి పోవడమే తరువాయి అన్నారు. చివరకు చంద్రబాబు ఏ స్థాయికి దిగిపోయాడు అంటే తనను పొగిడేవాడు లేక ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్‌తో పొగిడించుకునే ప్రయత్నం చేశాడన్నారు.












Click it and Unblock the Notifications