జగన్ బాధ్యుడైతే.. చంద్రబాబూ కావాలిగా..అంబటి సూటి ప్రశ్న..!
ఏపీలో తిరుపతి వైకుంఠం టోకెన్ల తొక్కిసలాట అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దానికి కారణమవుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం, అలాగే టీటీడీ బోర్డు కూడా క్షమాపణ చెప్పాలని ఆదేశించడం, ముందు లేదన్నా ఆ తర్వాత ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు కోరడం చూస్తున్నాం. అలాగే బాధితుల పరామర్శకు జగన్ మందీ మార్బలంతో రావడంపై కూటమి పార్టీలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.
ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు కూటమి సర్కార్ కు మరో కీలకమైన ప్రశ్న వేశారు. గతంలో తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమపై విమర్శలు చేసిన కూటమిని టార్గెట్ చేసేలా అంబటి ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో తిరుమల లడ్డూ వివాదాన్ని తాజా తొక్కిసలాట ఘటనతో పోలుస్తూ.. "కలవని "కల్తీ లడ్డుకి" బాధ్యుడు అప్పటి ముఖ్యమంత్రా? ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడు కాదా?"అని అంబటి ప్రశ్నించారు.

అప్పట్లో తిరుమల లడ్డూ కల్తీ కూటమి ప్రభుత్వంలో జరిగినా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు ఆధారంగా జరిగిందంటూ విపక్షాన్ని కూటమి సర్కార్ లో పార్టీలు టార్గెట్ చేశాయి. ఇప్పుడు తొక్కిసలాట ఘటనలో మాత్రం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కనిపించింది. దీంతో ఇప్పుడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనకు బాథ్యత తీసుకుంటారా అనే అర్ధం వచ్చేలా అంబటి ఈ ట్వీట్ చేశారు. ఇప్పటివరకూ చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, టీటీడీ బోర్డు కానీ ఈ ఘటనకు బాధ్యత తీసుకుంటామని ప్రకటించలేదు.
కలవని "కల్తీ లడ్డుకి" బాధ్యుడు
— Ambati Rambabu (@AmbatiRambabu) January 11, 2025
అప్పటి ముఖ్యమంత్రా?
ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి
ముఖ్యమంత్రి బాధ్యుడు కాదా?@PawanKalyan












Click it and Unblock the Notifications